క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన సీఎం వైయ‌స్ జగన్  

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

నెల్లూరు: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆడుదాం.. ఆంధ్ర.. కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు.. క్రీడల వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. క్రికెట్ ఆడే దేశాల్లో అతి పెద్దదైన మన దేశం నుంచి.. ఎందరో సామాన్య క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదిగారు అంటూ విజయసాయిరెడ్డి వెల్లడించారు. 
 
నెల్లూరులో క్రీడాకారులకు క్రికెట్ కిట్లను వైయ‌స్ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అందించారు.  ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. మన దేశంలో క్రికెట్ కు ఆదరణ అధికంగా ఉంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అన్ని ఫార్మాట్లో మన దేశం రాణించడం అందరికీ గర్వకారణం అని తెలిపారు. క్రికెట్ క్రీడాకారుల్లో పలువురు.. రాజకీయాల్లోకి కూడా ప్రవేశించి రాణిస్తున్నారు.. విశాఖపట్నంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 800 జట్లతో క్రికెట్ పోటీలు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. నెల్లూరులో కూడా ఏటా ఇలాంటి పోటీలు నిర్వహిస్తాం.. ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగు లోకి తీసుకురావడమే ఈ టోర్నమెంట్ లక్ష్యం.. నెల్లూరు రూరల్ లోని మొగ్గళ్ళ పాలెంలో 150 ఎకరాల్లో క్రీడా వసతులను కల్పిస్తాం.. ఇందు కోసం రూ.200 కోట్లను వెచ్చిస్తామన్నారు. ఈ అంశాన్ని అంశాన్ని వైయ‌స్ఆర్‌ సీపీ మ్యానిఫెస్టోలో కూడా చేరుస్తామని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావుతో పాటు జెడ్పీ చైర్మన్ అరుణమ్మ, మేయర్ స్రవంతి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Back to Top