కార్యకర్తల కృషి, చిత్తశుద్ధి వల్లే అధికారంలోకి వచ్చాం

చ‌రిత్ర గ‌తిని మార్చి సుప‌రిపాల‌న అందిస్తున్న ప్ర‌భుత్వం మ‌న‌ది

మ‌రో 20 ఏళ్ల పాటు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారంలో ఉండాలి

సీబీన్ అంటే చంద్ర బూతుల నాయుడు, ఏడుపుగొట్టు నాయుడు

టీడీపీ నేతలు బూతులు తిడుతుంటే మహానాడులో బాబు శునకానందం

చవట, దద్దమ్మ లోకేష్‌ను చూసి బాబుకు పశ్చాత్తాపం లేదు

బాబు 14 ఏళ్ల‌ పరిపాలనపై ప్రజల వద్దకు వెళితే చెప్పు తీసుకుని కొడతారు

సామాజిక వర్గాలను వదిలేసి.. సామాజిక మాధ్యమాలపైనే బాబు ఆధారపడ్డాడు

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ  విజయసాయి రెడ్డి

తాడేపల్లి: ఇచ్చిన మాటకు కట్టుబడి, ధైర్యంగా నిలబడి రాష్ట్ర చరిత్ర గతిని మార్చి సుపరిపాలన అందిస్తున్న ఘనత వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వానిదేన‌ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం మూడేళ్లు పూర్తిచేసుకుందని, ఈ మూడేళ్లలో అనేక సంస్కరణలు, సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల ద్వారా రూ.1.40 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు సీఎం వైయస్‌ జగన్‌ అందించారని చెప్పారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసి మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో సుపరిపాలనకు మూడేళ్లు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిందంటే.. అది కార్యకర్తల కృషి, చిత్తశుద్ధి వల్లనేనని, 9, 10 సంవత్సరాల పాటు చేసిన కృషి వల్లనే అధికారంలోకి వచ్చామన్నారు. ప్రజాప్రభుత్వం మూడేళ్లు పూర్తిచేసుకుందని చెప్పారు. అంతకుముందు బుల్లెట్ బైక్ పై విజయసాయిరెడ్డి కార్యకర్తలపాటు పార్టీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. 

ఈ సంద‌ర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..
 
మన పార్టీ అధికారంలోకి వచ్చిందంటే పదేళ్ళపాటు పార్టీ కార్యకర్తల కృషి. కార్యకర్తల చిత్తశుద్దే కారణం. ఈ విషయాన్ని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికీ మరిచిపోదు. ఇది మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. వైయ‌స్ జగన్‌ అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న ప్రభుత్వం.

1. మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వం. 95శాతం హామీలు నెరవేర్చిన ప్రభుత్వం.
2. సామాజిక న్యాయ పాలన అందించిన ప్రభుత్వం. 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి లబ్ధి చేకూర్చి సామాజిక న్యాయం చేసిన ప్రభుత్వం.
3. పరిపాలనా సంస్కరణలు అమలు చేసిన ప్రభుత్వం. పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ,  26 జిల్లాలు చేయడం. ఇదంతా పరిపాలన సౌలభ్యం కోసం సంస్కరణలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది.
4. సంక్షేమం గురించి చెప్పాలంటే ఒక లక్షా 40వేల కోట్ల రూపాయిలు గత మూడేళ్లలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం.
5. రైతుకు భరోసా ఇచ్చిన ప్రభుత్వం.. రైతుల కోసం రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ,  సున్నా వడ్డీ, ఆర్బీకేల ద్వారా రైతుల పొలాల వద్దే పంటను కొనుగోలు చేసిన రైతు ప్రభుత్వం మనది
6. మహిళా సాధికారత.. మహిళలందరికీ కూడా నామినేటెడ్‌ పోస్టుల్లో, పనుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం. ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వం.
7. వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవం..  దాదాపు 95శాతం జనాభాకు ఆరోగ్యశ్రీ పథకం కవర్ అవుతుంది. ఏ ఒక్కరూ కూడా డబ్బులు లేకున్నా, అనారోగ్యంతో బాధపడకూడదని, పేదవాడికి కూడా కార్పొరేట్‌ వైద్యం అందాలనే ఉద్దేశంతో ఆదాయ పరిమితిని పెంచి,  95 శాతం మందికి ఉచితంగానే వైద్యం అందిస్తున్న ప్రభుత్వం.
8. విద్యారంగం.. నాడు-నేడు ద్నారా, ప్రభుత్వ స్కూళ్ళు, ఆస్పత్రులు గత మూడేళ్లలో ఆధునీకరించి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో ఏ ఒక్కరూ నిరక్ష్యరాస్యులుగా ఉండకూడదని అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి పిల్లవాడికి విద్యనందించాలని మన ప్రభుత్వం ధృడ నిశ్చయంతో ఉంది. ఈ ఎనిమిది అంశాల్లో మనం ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదు. భవిష్యత్‌లో ఈ పథకాలను అన్నింటిని కొనసాగిస్తాం. 

బాబు 14 ఏళ్ల‌లో సాధించలేనిది.. మనం మూడేళ్ల‌లో సాధించాం
చంద్రబాబు గురించి మాట్లాడితే.. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా, 13ఏళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉండి  ఆయన ఏం సాధించారు? చంద్రబాబు సాధించలేనిది.. మనం మూడేళ్లలోనే చేసి చూపించాం. చంద్రబాబు రూ. 87వేల కోట్లు వ్యవసాయ రుణాలు అన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, 15వేల కోట్లు కూడా ఇవ్వకుండా మాట తప్పారు. డ్వాక్రా మహిళలకు 14వేల కోట్లు, రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, దానినీ గాలికి వదిలేశారు. 

రాష్ట్రంలోని పేదల సొంతింటి కలను సాకారం చేస్తోన్న మహానాయకుడు సీఎం వైయ‌స్‌ జగన్‌. అదే చంద్రబాబు హైదరాబాద్‌లో తన సొంతింటి కలను సాకారం చేసుకున్నాడే కానీ, పేద ప్రజల గురించి పట్టించుకోలేదు. పథకాల గురించి మాట్లాడే అర్హతే చంద్రబాబుకు లేదు. ఎందుకంటే ఆయన ఏ పథకాలు అమలు చేయలేదు కాబట్టి. పేదలు, బడుగు వర్గాలకు చేయూతనిచ్చి వారికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమాజంలో పైకి తీసుకురావాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ నాయకత్వంలో మన ప్రభుత్వం పనిచేస్తోంది.

టీడీపీ తొడల.. పార్టీగా మారిందా..?
చంద్రబాబు, తనచుట్టూ ఉన్నవాళ్లు, తన అనుచరులతో తొడలు కొట్టిస్తూ ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బూతులు తిట్టిస్తాడు, అసభ్య పదజాలం  ఉపయోగించేలా ప్రోత్సహిస్తాడు. టీడీపీ అంటే ఇది అసలు తెలుగుదేశం పార్టీయేనా అని ప్రశ్నిస్తున్నా? ఇది తెలుగుదేశం పార్టీ కాదు. ‘టీ అంటే తొడలు, డీ అంటే దేహం, పీ అంటే పార్టీ అని స్పష్టంగా చెబుతున్నాం. టీడీపీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాదు. ముఖ్యమంత్రిగారిని, టీడీపీ కార్యకర్తలతో,  తాగుబోతు అయ్యన్నపాత్రుడు, నారా లోకేష్‌తో బూతులు తిట్టించడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. ఇది బాధ్యత కలిగిన ప్రతిప‍క్ష పార్టీనా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం.

సీబీఎన్.. చంద్ర  బూతుల నాయుడు
సీబీఎన్‌ అంటే చంద్రబాబు నాయుడు అంటే.. సీ అంటే చంద్ర, బీ అంటే బూతులు. సీబీఎన్‌ అంటే చంద్ర బూతుల నాయుడు అని అనుకోవాల్సి వస్తోంది. ముఖ్యమంత్రిగారిని, ప్రభుత్వాన్ని బూతులు తిట్టిస్తూ.. చంద్రబాబు ఎంతగా సంతోషపడుతున్నాడో మహానాడులో అందరూ చూశారు. కార్యకర్తలు బూతులు తిట్టేటప్పుడు చంద్రబాబు మొహం కళకళలాడిపోతోంది. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? వాళ్లు బూతులు తిట్టేటప్పుడు చంద్రబాబు అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. దాన్నే శునకానందం అంటారు. ఈ శునకానందాన్ని పొందే చంద్రబాబును శునకం నాయుడు అని పిలవడంలో తప్పేమీ లేదేమో? చంద్రబాబు గడ్డం పెంచుకోగానే తాను పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటాడు. మనసులో మాత్రం ఎంతటి దుర్మార్గపు ఆలోచనలు పెట్టుకున్నాడో ప్రజలందరికీ తెలుసు. 

చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి భోరున ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే ఏవో కారణాలు చెబుతాడు. ఏడ్చి సింపతీ పొందాలనుకుంటాడు. సింపతీ కాదు కదా.. బూతులు నాయుడు, శునకపు నాయుడు అన్న బిరుదులతోపాటు.. ఒక ఏడుపుగొట్టు నాయుడు అనే పేరును తెచ్చుకుంటున్నాడు.

లోకేష్ ఒక చవట, దద్దమ్మ..
లోకేష్‌ గురించి చెప్పుకుంటే.. లోకేష్‌ ఒక చవట, దద్దమ్మ అని అందరికీ తెలుసు. అలాంటి చవట, దద్దమ్మను కన్న చంద్రబాబు నాయుడుకు పశ్చాత్తాపం కూడా లేదు. అందుకే దత్తపుత్రుడిని నమ్ముకుంటున్నాడు. దత్తపుత్రుడికి ఇచ్చే విలువ సొంత కొడుక్కి ఇవ్వడం లేదు. ఇంతకన్నా గొప్ప తండ్రి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాం. 14 ఏళ్లలో తన పాలనలో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఈ మేలు చేశాను, ఈ పథకం అమలు చేశానని ఇథమిద్దంగా కూడా చెప్పగలిగిన పరిస్థితి లేదు కాబట్టే చంద్రబాబును చేతల నాయుడా? లేకుంటే గాలి నాయుడా? అని, ఎన్నిపేర్లు కావాలంటే అన్ని పేర్లు బాబుకు పెట్టుకోవచ్చు. టీడీపీ అనేది ప్రజల మనసుల్లో ఎలాగూ లేదు. 

గడప గడపకు వెళ్లు.. బాబుకు ఛాలెంజ్
వైయస్సార్‌ సీపీ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్నాం. చేతనైతే, చంద్రబాబు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఛాలెంజ్‌ విసురుతున్నా..మీ 14ఏళ్ల పాలనలో మీరు చేసిన పనులు, మీరు చేసిన మేలు ప్రజలకు వివరించు. అప్పుడు ప్రజలు నిన్ను చెప్పు తీసుకుని కొట్టకుండా ఉంటే అడగండి. 72ఏళ్ల వయసు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు అసలు ప్రవర్తిస్తున్నాడా?. పదే పదే ఆత్మవంచన చేసుకుంటూ సుపరిపాలన అందిస్తున్న వైయ‌స్‌ జగన్‌ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషిస్తు తనకు తాను శునకానందం పొందుతున్నాడు. తనకు తాను రాజకీయ చాణుక్యుడు అనుకునే చంద్రబాబు,  ఆత్మ వంచన చేసుకుంటూ, ముసలివాడికి దసరా పండుగ అన్నట్టు పండుగలు చేసుకుంటున్నాడు. 

రాష్ట్రంలో వివిధ సామాజిక వర్గాలకు ఫలానా మేలు చేశానని చెప్పుకోవడాని చంద్రబాబుకు ఒక్కటీ లేదు. అందుకే చంద్రబాబు సామాజిక వర్గాలను వదిలేసి, సామాజిక మాధ్యమాలను నమ్ముకుని 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. 14ఏళ్ల పాలనలో చంద్రబాబు చేసింది, మూడేళ్ల పాలనలో జగన్‌ చేసిందీ ఏమిటో, అప్పటికి, ఇప్పటికి ఎంత వ్యత్యాసం ఉందోప్రజలు గుర్తించాలి. చంద్రబాబు అధికారంలో ఉంటే తనకు, తన కుటుంబ సభ్యులకు, తనవాళ్లకు కడుపు నిండుతుంది తప్ప పేదలకు కడుపు నిండదు.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్‌లో కూడా అధికారంలోకి రావాలి. మరో 20ఏళ్ల పాటు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలి. ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ, సంక్షేమ పథకాలు అమలు అవుతూ ప్రజలంతా సుఖ, సంతోషాలతో వర్థిల్లేలా వైయస్సార్‌ సీపీ పరిపాలన అందిస్తుంది. పార్టీ కార్యకర్తలు 2019 ఎన్నికల్లో ఏవిధమైన చిత్తశుద్ధి, ఉత్సాహంతో పనిచేశారో అదేవిధంగా 2024 ఎన్నికలలో కూడా పనిచేసి, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి జగన్‌ని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అందుకు మీ అందరి సహాయ, సహకారాలు కోరుకుంటున్నాను.

Back to Top