ఓటు హ‌క్కు వినియోగించుకున్న వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు

న్యూఢిల్లీ: రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌లో జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొని ఎన్డీయే అభ్య‌ర్థి శ్రీమతి ద్రౌపది ముర్ముకి అనుకూలంగా వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు ఓటు వేశారు. ఈ ఎన్నిక ద్వారా తొలిసారిగా ఒక ఆదివాసీ గిరిజన మహిళ భారతదేశ 15వ రాష్ట్రపతి కాబోతున్నారని వైయ‌స్ఆర్ సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి సంతోషం వ్య‌క్తం చేశారు. ఓటింగ్‌లో వైయ‌స్ఆర్ సీపీ లోక్‌స‌భ స‌భ్యులు, రాజ్య‌స‌భ స‌భ్యులంతా పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top