న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యులుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 22 మంది పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇవాళ ప్రొటెమ్ స్పీక వీరేంద్రకుమార్ పార్లమెంట్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధిక శాతం మంది సభ్యులు తెలుగులో ప్రమాణం చేయగా, అనురాధ హిందీలో, రఘురామకృష్ణమరాజు, కోటగిరి శ్రీధర్, మాగుంట శ్రీనివాసరెడ్డి, పోచా బ్రహ్మానందరెడ్డి, సింగారి సంజీవ్ కుమార్ఇం, గోరంట్ల మాధవ్, అవినాష్‌రెడ్డి, ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులను పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. పార్లమెంటు సభ్యులు 1. కడప – వైయస్‌అవినాష్‌రెడ్డి 2. రాజంపేట – పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి 3. చిత్తూరు – నల్లకొండగారి రెడ్డెప్ప 4. తిరుపతి – బల్లె దుర్గాప్రసాద్ 5. హిందూపురం – గోరంట్ల మాధవ్ 6. అనంతపురం – తలారి రంగయ్య 7. కర్నూలు – డాక్టర్‌సింగరి సంజీవ్‌కుమార్ 8. నంద్యాల – పి.బ్రహ్మానందరెడ్డి 9. నెల్లూరు – ఆదాల ప్రభాకర్‌రెడ్డి 10. ఒంగోలు – మాగుంట శ్రీనివాసరెడ్డి 11. బాపట్ల – నందిగం సురేష్ 12. నరసరావుపేట – లావు శ్రీకష్ణదేవరాయలు 13. మచిలీపట్నం – బాలశౌరి 14. నరసాపురం – రఘురామ కృష్ణంరాజు 15. రాజమండ్రి – మార్గాని భరత్ 16. అమలాపురం – చింతా అనూరాధ 17. అనకాపల్లి – డాక్టర్‌వెంకట సత్యవతి 18. కాకినాడ – వంగా గీత 19. ఏలూరు – కోటగిరి శ్రీధర్ 20. విశాఖపట్నం – ఎంవీవీ సత్యనారాయణ 21. విజయనగరం – బెల్లాని చంద్రశేఖర్ 22. అరకు – గొడ్డేటి మాధవి డియోలు