చంద్రబాబు నిజం మాట్లాడటమే మర్చిపోయారు

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 

అమరావతి: చంద్రబాబునాయుడిని మళ్లీ గోబెల్స్ ఆత్మ ఆవహించిందని, నిజం మాట్లాడటమే మర్చిపోయారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. 
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతించిన జీవోను ప్రభుత్వం నిన్న రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోను తమ హయాంలో రద్దు చేశామని, మళ్లీ ఇప్పుడు రద్దు చేయడమేంటని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు విమర్శించడాన్ని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.  విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతినిస్తూ 2015 నవంబరు 5న జీవో నంబర్ 97 జారీ చేసింది చంద్రబాబే అని, రద్దయిన జీవోను తిరిగి క్యాన్సిల్ చేయడమేంటని ఆయన ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top