ఆరోపణలు చేసేవారు సీబీఐ ఎంక్వైరీ కోరినా సరే

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖ: విశాఖపట్నంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఆరోపణలు చేసే టీడీపీ నేతలు సీబీఐ లేదా ఎఫ్‌బీఐతో విచారణ కోరినా పర్వాలేదన్నారు. వైయస్‌ఆర్‌ సెంట్రల్‌ పార్కులో దేశ, విదేశాలకు చెందిన పూలతో ఫ్లవర్‌ షోను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. అనంతరం విలేకరుల ప్రశ్నలకు ఎంపీ విజయసాయిరెడ్డి బదులిస్తూ.. ఆయన కుటుంబం మాత్రమే బాగుండాలని చంద్రబాబు కోరుకుంటున్నాడని, తాను తప్ప ఎవరూ ఎదగకూడదనే కుటిలమైన మసస్తత్వం చంద్రబాబుదన్నారు. చంద్రబాబు, టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గత ఐదేళ్లు ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం వేధించిందని, ఇచ్చిన అవకాశాన్ని టీడీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసుకుందన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top