విశాఖలో టీడీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం

వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి

తాడేపల్లి: వాసుపల్లి గణేష్‌ కుటుంబం విశాఖ ప్రజల కోసం చేస్తున్న సేవలు హర్షణీయమని, సమాజానికి సేవ ఏయాలనే ఉద్దేశం చాలా మంచిదని వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమారులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి రావడం విశాఖలో పార్టీకి బలాన్ని ఇస్తోందన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధిని చూసి టీడీపీలోని విద్యావంతులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తున్నారన్నారు. భవిష్యత్తులో వైయస్‌ఆర్‌ సీపీలోకి చాలా మంది వస్తారన్నారు. విశాఖలో టీడీపీ తుడిచిపెట్టుకు పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ‘రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటే కదా.. ప్రతిపక్ష నాయకుడు ఉండేది. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండదు’ అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top