పుట్ట పగులుతుంటే పచ్చపార్టీ తట్టుకోలేకపోతోంది

తాడేపల్లి: ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ట్విట్టర్‌ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘పాలనాధికారం ఉంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కుతుందని రాజకీయ పార్టీలు భావిస్తాయి. పచ్చ పార్టీ ఫిలాసఫీ మాత్రం దీనికి భిన్నం. దోపిడీలు, ఆక్రమణలు, తవ్వకాలకు  పవర్‌ తప్పనిసరి అని అనుకుంటుంది. అందుకే అన్నిరకాల మాఫియాలను ప్రోత్సహించింది. పుట్ట పగులుతుంటే తట్టుకోలేక పోతోంది’ అంటూ ట్వీట్‌ చేశారు.

అదే విధంగా.. ‘అక్రమ కట్టడాలను చట్ట ప్రకారం కూలిస్తే పచ్చ బ్యాచ్‌ మొత్తం నెత్తీ నోరు కొట్టుకుంటోంది. ఆంధ్రా యూనివర్సిటీని దయ్యాల కొంపని సదరు ఆక్రమదారుడు వెటకారం చేసినప్పుడు పేదలు చదువుకునే ఏయూని భ్రష్టు పట్టించినప్పుడు ఒక్కరూ మాట్లాడలేదు. పేదల ప్రయోజనాలకన్నా పచ్చనాయకుని ప్రయోజనాలే ఎక్కువైపోయాయా?’ అంటూ మరో ట్వీట్‌ చేశారు. 
 

Back to Top