తిరుపతి: చంద్రబాబు ప్రమాణ స్వీకారం మొదలైన నుంచి రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయి. ఒక మాఫీయ రాజ్యం ఏలుతుందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కనిపించడం లేదు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అరాచకం చేస్తున్నారు. పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. నాలుగు నెలల్లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరిగాయి. మనం చూస్తూనే ఉన్నాం. అడ్డంగా దోచుకుని జేబులు నింపుకుంటున్నారు. వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనపై ఏదో రాద్దాంతం చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం చేశారు. ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. వైయస్ఆర్‌సీపీ అధినేత, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ కట్టడాలు చేయలేదు. కరకట్ట అక్రమ కట్టడంలో చంద్రబాబు ఉంటున్నారు. వైయస్ జగన్ కట్టించిన రుషికొండ భవనాలు చూసి చంద్రబాబు సంతోపడ్డారు. వైఎస్ జగన్ విలాసం కోసం కట్టించుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రుషికొండపై ఉన్న భవనం వైఎస్ జగన్‌దే అయితే ఆయనకే రాసి ఇచ్చేయండి. ఇప్పటికైనా చంద్రబాబు తప్పుడు ప్రచారాలను మానుకోవాలి. అసెంబ్లీ భవనాలు చూస్తే నీ పాలన అర్థం అవుతుంది. వైయస్ జగన్ చేసిన వేల కోట్ల సంక్షేమంతో నీవు పోల్చుకోగలవా చంద్రబాబు?. సూపర్ సిక్స్ ఎక్కడా అమలు లేదు. ఈ ఐదు నెలల్లో 53వేల కోట్లు అప్పు చేశాడు. చంద్రబాబు ప్రతీరోజు అప్పు చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి. వైయస్ జగన్ చేసిన అప్పులు నిర్మాణాత్మకంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరూ ఊహించని విజయం సాధిస్తాం : వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ ఎవరూ ఊహించని విధంగా విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయని విజయసాయిరెడ్డి పేర్కొ న్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అంటే మూఢ నమ్మకం కాదు, ప్రజలకు సేవలు చేస్తూ, దళిత గోవిందం, సోషలిస్టు భావజాలం ప్రజలకు తీసుకువెళ్ళిన నాయకుడు భూమన కరుణాకరరెడ్డి. తిరుపతి నగరం గత ఐదేళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందింది. భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలల్లో ఎన్నో దారుణాలు జరిగాయి. 2027 చివరిలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విజయం సాధిస్తాం. ఆ ఎన్నికల్లో భూమన కరుణాకరరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ మాఫియా రాజ్యం నడుస్తోందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. రుషికొండపై వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కట్టించిన భవనం చూసి చంద్రబాబు సంతోషపడ్డారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రుషికొండపై ఉన్న భవనం వైయస్ జగన్‌దే అయితే ఆయనకే రాసి ఇచ్చేయండి అని కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో అన్ని స్థానాలు గెలిచి తీరుతాం : ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వైయస్ జగన్ ఎన్నో అభిృవృద్ధి చారిత్రాత్మక కార్యక్రమాలు చేశారు ఈరోజు ప్రజలు కు సంక్షేమం దూరం అయింది సిక్స్ ప్యాక్ హామీలు అని చెప్పి మోసం చేశారు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు దేవుడును కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకున్నారో చూశాం విశాఖకు వెళ్ళి ఋషి కొండ నిర్మాణలు చూస్తున్నారు సంపద సృష్టిస్తున్నాం అంటూనే.. 16 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంపద సృష్టిస్తే , ప్రవేట్ పరం చేస్తున్నారు చంద్రబాబు రాష్ర్ట వ్యాప్తంగా 4 పోర్టులు నిర్మాణము చేస్తే చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు రాబోయే రోజుల్లో కార్యకర్తలు మరింత గుర్తింపు ఇస్తాం 2027 లోనే జమీలి ఎన్నికలు రాబోతున్నాయి మళ్ళీ వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేద్దాం. తిరుపతి నగరం ఎంతో అభివృద్ధి చేసిన ఘనత భూమన దే దివంగత నేత వైయస్ఆర్‌తో పాదయాత్రలో పాలు పంచుకున్న నేతలు ఈ స్టేజిపై భూమన కరుణాకరరెడ్డి, అంబటి రాంబాబు భూమన కరుణాకరరెడ్డి జీవితం అంతా వైయస్ఆర్ కుటుంబం తోనే.. ఆయనలో ఉన్న నాయకత్వ పటిమ రాబోయే...రోజుల్లో అన్ని స్థానాలు గెలిచి తీరుతాం ప్రజా ఉద్యమం తిరుపతి నుంచే ప్రారంభమైంది : తిరుపతి ఎంపీ గురుమూర్తి, క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ప్రజా ఉద్యమం తిరుపతి నుంచే ప్రారంభం అయ్యింది రెడ్ బుక్ పాలన, చాప్టర్ 1, చాప్టర్ 2, 3 పేరుతో ప్రజలను , వైఎస్సార్‌సీపీ శ్రేణులును ఏవిధంగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో తిరుపతి పార్లమెంట్ స్థానం పరిధిలో అన్ని స్థానాలు గెలిచి తీరుతాం ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో మరింత ఐక్యంగా పనిచేస్తాం కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతుంది. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం ఆదర్శ నగరంగా తిరుపతి : విజయనంద రెడ్డి, చిత్తూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జి పార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా కృషి చేస్తాం భూమన కరుణాకరరెడ్డి తిరుపతి నగరం అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపారు ఐక్యమే మన బలం, మన ఆయుధం: అంబటి రాంబాబు భూమన కరుణాకరరెడ్డి అద్బుత పుస్తక పఠన శక్తి ఉన్న నాయకుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా లో అన్ని స్థానాలు గెలుపుకు కృషి చేస్తారు దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య దేశం లో గెలుపు ఓటములు సహజం ఐక్యమే మన బలం, మన ఆయుధం ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతుంది మద్యం దుకాణాలు తెరవక ముందే టిడిపి నేతలు దుకాణాలు తెరిచారు వీటి అన్నింటినీ ప్రజలు దృష్టికి తీసుకువెళ్లాలి.. ప్రజలు బంగారు పళ్ళెంలో పెట్టీ మనకు అధికారం ఇస్తారు పవన్ కళ్యాణ్ మహిళలకు అన్యాయం జరిగితే సంహించను చెప్పిన వ్యక్తి ఈరోజు ఎక్కడ రోజుకో హత్య , అత్యాచారం జరుగుతోంది చంద్రబాబు పాలనలో ఏమి జరిగినా ప్రశ్నించరా.. మీ నోటికి ప్లాస్టర్ తీయండి మీ బాధ్యత గుర్తు చేస్తున్నాం సీపీఐ, సీపీఎంతో పవన్ పొత్తు పెడితే చేగువేరా గుర్తుకు వస్తాది బిజెపితో పొత్తు లో భాగంగా సనాతన ధర్మం గుర్తుకు వస్తుంది చంద్రబాబు ఋషి కొండ భవనాలు చూసి ఆశ్చర్య పోతున్నదు చంద్రబాబు ఈ భవనాలు చూసి సిగ్గు పడాలి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు కాలర్ ఎగరేసుకుని చెప్పండి రుషికొండ అద్భుత భవనాలు కట్టాడు అని చెప్పండి ఋషి కొండ లో ప్రభుత్వ భవనాలు కడితే విలాస భవనాలు అంటూ చంద్రబాబు విష ప్రచారం చేశారు శర వేగంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది రెడ్ బుక్ కు మా కుక్క కూడా భయ పడదు యువతరం ఈరోజు ముందుకు వచ్చింది చంద్రబాబు సొంత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని స్థానాలు గెలుస్తుంది ఐక్యత మన ఆయుధం, విజయమే మన లక్ష్యం రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 25 ఏళ్ల చిన్న వయస్సు యువకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ను ఓడించడానికి అన్ని పార్టీలు కృషి చేశారు 25 ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రగిరిలో చంద్రబాబు రంగంలోకి దించారు ఆరు రోజులు లోకేష్ పాదయాత్ర చేసి మోహిత్ ఓటమికోసం పనిచేశాడు చిన్న యువకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ను ఓడించడానికి ఇన్ని కుట్రలు చేశారు చంద్రగిరి నియోజకవర్గం లో ఈరోజు 25 మంది ఎమ్మెల్యేలు పాలిస్తున్నారు విద్యార్థి దశ నుంచే భూమన నాయకత్వం పటిమ చూపారు: డాక్టర్ శిరీష, మేయర్ తిరుపతి కరోనా సమయంలో మూడు సార్లు కరోనా బారిన పడ్డా వెనకడు వేయలేదు కరోనా సమయంలో అనాథ శవాలను దహనం చేసారు, సాక్షాత్తు దేశ ప్రధాని మోది నుంచి ప్రశంశలు అందుకున్నారు భూమన కరుణాకరరెడ్డి మేయర్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు అవకాశం కల్పించారు జిల్లా అధ్యక్షుడు గా ఆయన నాయకత్వం లో పనిచేస్తాం కోరుముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే కామెంట్స్.. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రతి కుటుంబం ఆలోచన చేస్తోంది కష్టకాలంలో అండగా నిలిచే వ్యక్తి భూమన కరుణాకరరెడ్డి కేటీఆర్ నాతో ఒక మాట అన్నారు.. దేశంలో 40 శాతం ఓటు వచ్చి ఓటమి చెందడం బాధగా ఉంది అన్నారు 40 శాతం ఓటింగ్ వచ్చిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏవిధంగా ఉందో ప్రజలు అందరికీ తెలుసు: నారాయణస్వామి సజ్జలు రామకృష్ణా రెడ్డి పై తప్పుడు కేసులు పెట్టీ ఇబ్బందులు పెడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే పార్టీ చంద్రబాబు బీసీ లకు ఎప్పుడు రాజ్యసభ సీటు ఇవ్వలేదు, జగన్ మోహన్ రెడ్డి రాజ్య సభ సీటు ఇచ్చారు ఈరోజు వాళ్ళు అమ్ముడు పోయారు కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీయొద్దు చంద్రబాబు ఎదిరించే వాళ్ళు లేరు అంటున్నారు ఎల్లో మీడియా..ఎన్టీఆర్ లాంటి వాళ్ళనే నిలువునా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు మేనేజ్ మెంట్ లో దిట్ట చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ, బిజెపి, విజయమ్మ, షర్మిలమ్మ ను మేనేజ్ చేస్తున్నాడు సారాయి ఇస్తాను అని చెప్పి, వీధి వీధి కు అమ్మకం చేస్తున్నారు చంద్రబాబు దేశంలో 51 శాతం ఓటు వచ్చి గెలిచిన ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి, 40 శాతం ఓట్లు వచ్చి ఓడిన ప్రజలు వెన్నంటే ఉన్నారు సర్వేలు చేయొద్దు , పేద వాడికోసం పాటుపడుతున్న జగన్ మోహన్ రెడ్డి కు అండగా నిలుద్దాం సనాతన ధర్మం గురించి మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఎంతో అధ్బుతంగా చెప్పారు, యూట్యూబ్ లో చూడండి సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది పవన్ కళ్యాణ్‌కు పూర్తిగా తెలీదు EVM ప్రొడక్షన్ వారి CBN ప్రభుత్వం: ఆర్కే రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన ఉచితంలో ఉచితం లేదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు పాలనలో పవన్ కల్యాణ్ నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడా?. ప్రశ్నిస్తాను అంటూ బిల్డప్ ఇచ్చిన పవన్ ఇప్పుడు ఏమైపోయాడని ప్రశ్నించారు. తొక్కి నారతీస్తామని చెప్పిన పవన్‌కు ప్రజలే నొక్కి తాట తీస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు ఈ జిల్లా వ్యక్తి అని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నాం. సూపర్ సిక్స్ కాదు, సూపర్ చీటింగ్ చేస్తున్నాడు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డికి మనం అండగా నిలవాలి. కూటమి ప్రభుత్వం మెడలు వంచాలి. తప్పుడు ప్రచారం వల్ల మనం ఓడిపోయాం. సూపర్ సిక్స్ అమలు కావడం లేదు. సంక్షేమ పథకాలు లేవు చంద్రబాబు చెప్పిన ఉచితంలో ఉచితం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఏవీఎం బ్యానర్‌లో ఎన్నో పెద్ద పెద్ద హిట్ సినిమాలు తీశారు. రాష్ట్రంలో ఈవీఎం ప్రొడక్షన్ వారి సీబీఎన్ ప్రభుత్వం కొనసాగుతోంది. సూటిగా ప్రశ్నిస్తున్న.. రెడ్ బుక్ అంటూ మీ కొడుకు ఏవిధంగా వేధిస్తున్నాడో చూస్తున్నాం. చంద్రబాబు పాలనలో నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు డిప్యూటీ సీఎం పవన్. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయి. విజయవాడ నగరం నీట ముంచేశారు. పులిహోర పొట్లాలకు 360 కోట్లు ఖర్చు చేశారు. దాని పేరుతో డబ్బులు దోచుకున్నారు. ప్రశ్నించే పార్టీ అని చెప్పిన పవన్ ఇప్పుడేం చేస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడు?. దారుణాలపై ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాడు. తొక్కి నారతీస్తామన్న పవన్‌ను ప్రజలే నొక్కి తాట తీస్తారు. ఈ రాక్షస పాలన అంతం చేయాలి. ఈరోజు నుంచి రెట్టించిన ఉత్సాహంతో దూసుకువెళ్దాం. మన జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి కృషి చేయాలి. కుల మతాలకు అతీతంగా వైయస్ జగన్ కృషి చేశారు. నేను కార్యకర్తలు మనిషిని: భూమన కరుణాకరరెడ్డి చంద్రబాబు నాయుడుతో ఢీ కొట్టడము అంటే ఎప్పుడు సిద్ధమే కార్యకర్తలు కోసమే నిలబడతాను నేను గ్రూపులు కట్టడానికి రాలేదు.. ఒక నేతగా కాదు.. కార్యకర్తలకు అండగా నిలుస్తాను నియోజకవ్గంలో ఇన్చార్జి కు అనుగుణముగా పనిచేస్తా వైయస్.రాజారెడ్డి శిష్యుడిగా .. వైయస్ రాజశేఖర్ రెడ్డితో నడిచిన వాడిని, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో పనిచేస్తున్న వాడిని అహంకారంతో పనిచేయను అని ప్రమాణం చేస్తున్నా వైయస్ఆర్ కుటుంబం తో 49 ఏళ్లుగా పనిచేస్తున్నా వయసు సడలుతున్నా.. మొక్కవోని ధైర్యంతో పనిచేస్తా వైయస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ సిఎంగా పని చేస్తా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలు, సలహాలు, పాటిస్తూ మందుకు వెళ్తాను అనివార్య కారణాల వల్ల ఈ సమావేశం కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దూరంగా ఉన్నారు.. ఆయన ఒక సందేశం పంపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యారాయణ సందేశంలను చదివి వినిపించిన భూమన కరుణాకరరెడ్డి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ఒక సందేశం పంపించారు ఎల్లో మీడియా దీనిపై విష ప్రచారం చేస్తోంది రాజకీయమే నాకు ఊపిరి నేను కార్యకర్తగా ఉంటాను, పార్టీ పటిష్ఠం వేగవంతం చేయడానికి పనిచేస్తా వైయస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసేందుకు కృషి చేస్తా