అటువంటి వారికి క‌ఠిన శిక్ష త‌ప్ప‌దు

వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌

విశాఖ: ‌దేవాల‌యాలపై జ‌రుగుతున్న దాడుల వెనుక కుట్ర‌కోణం దాగి ఉంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ అనుమానం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో మ‌త కలహాలు సృష్టించి రాజకీయ లబ్ధిపొందాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ మీడియాతో మాట్లాడుతూ.. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అటువంటి వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top