న్యూఢిల్లీ: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి నిధులు తెచ్చింది టీడీపీకి కనబడలేదా? అని వైయస్ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏపీని వెనక్కి తీసుకెళ్లేలా చంద్రబాబు వ్యవహరించారని దుయ్యబట్టారు. చంద్రబాబు తీరుతో ఏపీ నష్టపోయిందని అన్నారు. కేంద్రం నుంచి సీఎంవైయస్ జగన్ రూ.10,461 కోట్ల నిధులు తీసుకొచ్చారన్నారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి శతజయంతి ఉత్సవాలా? అంటూ చంద్రబాబుపై ఎంపీ ధ్వజమెత్తారు. నూతన పార్లమెంటు ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
సీఎం వైయస్ జగన్ రాష్ట్రానికి నిధులు తెచ్చింది టీడీపీకి కనబడలేదా?. రాష్ట్రానికి రెవెన్యూ డెఫిషిట్ కింద రూ.10,461 కోట్లు సాధించాం. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు కూడా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని చంద్రబాబు, ఇప్పుడు తన కొడుకును ప్రమోట్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ను గతంలో కించపర్చిన ఈనాడు.. ఇప్పుడు యుగ పురుషుడు అని కీర్తిస్తోంది’’ అంటూ మార్గాని భరత్ మండిపడ్డారు.