టీడీపీ.. బీజేపీ.. జనసేనను కలపడమే పవన్‌ రోడ్‌ మ్యాప్‌?

అందుకోసమే కళ్యాణ్‌కు ప్యాకేజీ ఇచ్చేది

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌

ప్రధానిని పవన్‌ రాష్ట్రానికి ఏం అడిగారు

ప్రత్యేక హోదాపై పవన్‌ కేంద్రాన్ని నిలదీశారా? 

రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు

ఆరు కోట్ల మంది ప్రజల ఆకాంక్షను లక్షాలాది మంది సాక్షిగా వైయస్‌ జగన్‌ ప్రధానిని అడిగారు

రాజమండ్రి: తెలుగు దేశం, బీజేపీ, జనసేన పార్టీలను కలపడమే పవన్‌ కళ్యాణ్‌ రోడ్‌ మ్యాప్‌ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌ విమర్శించారు. అందుకే పవన్‌కు ప్యాకేజీ ఇస్తున్నారని చెప్పారు. ప్రధాని విశాఖ వచ్చిన సందర్భంలో నరేంద్రమోదీని పవన్‌ రాష్ట్రానికి ఏం కావాలని అడిగారు?. ప్రత్యేక హోదాపై పవన్‌ కేంద్రాన్ని నిలదీశారా? అని ప్రశ్నించారు. వైయస్‌ జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజమండ్రిలో మార్గాని భరత్‌ సోమవారం మీడియాతో మాట్లాడారు.

ఈ నెల 12వ తేదీ విశాఖ వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఆరు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చాలని, విభజన హామీలు అమలు చేయాలని లక్షలాది మంది సాక్షిగా ప్రధానిని అడిగారు. కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఏపీకి ఉపయోగపడుతుంది. ప్రతి సంస్థ కూడా అభివృద్ధి చెందుతుందని క్లియర్‌గా చెప్పారు. అది ఒక నాయకుడి తాలుకా లక్షణం.  ప్రధాని ఎదురుగా చెప్పడం సీఎం వైయస్‌ జగన్‌ గొప్పతనం. 

పవన్‌ కల్యాణ్‌ను గమనిస్తే ..ఆయన కూడా ప్రధానిని కలవడం జరిగింది. విశాఖలో ఆయన కలిసినప్పుడు బయటకు వచ్చి మీడియా  ముందు పవన్‌ హావభావాలు ఏవిధంగా ఉన్నాయో చూశాం. లక్షలాది మంది ప్రజల సమక్షంలో ఆరుకోట్ల ఆంధ్రులు వీక్షిస్తున్న సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏ రకంగా మాట్లాడారు. జనసేన అధినేత పవన్‌ నాకు ఒక  అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు. ఏ విషయంలో మిమ్మల్ని నమ్మాలి.

ప్రధానితో కలిసి బయటకు వచ్చిన తరువాత ఆయన్ను పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హామీలు అడిగామని చెప్పలేదే?. విశాఖ స్టిల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌పరం చేయవద్దని అడిగారా? సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ అడిగారా? ప్రధానిని పవన్‌ ఏమడిగారు?. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పవన్‌కు లేదా? మీది కూడా ఒక రాజకీయ పార్టీనే కదా?. ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకునే వ్యక్తికి ఆ మాత్రం బాధ్యత లేదా?. పవన్‌కు మినిమమ్‌ అవగాహన లేకుంటే ఎలా? రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఒక నాయకుడు ఏరకంగా లక్షలాది ప్రజల ముందు దేశ ప్రధాని వద్ద ప్రజల సమస్యలపై విన్నవించిన తీరు ఎలా ఉంది? టీవీలు వీక్షిస్తున్న ప్రేక్షకుల ముందు పవన్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన తీరు ఏరకంగా ఉంది?. 

అంటే పవన్‌ ఎజెండా వైయస్‌ జగనే. చిన్నబాబు, పెద్దబాబులను ప్రధానితో కలపడమే ఈ ప్యాకేజీ స్టార్‌ ఎజెండా?ఈ విషయం క్లియర్‌కట్‌గా తేటతెల్లం అవుతోంది. ఇవాళ మేం ప్రశ్నిస్తున్నాం..ఆం«ధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ను పక్కకు తోసేసి, చిన్నబాబు, పెద్దబాబు  భవిష్యత్‌ మాత్రమే మీ ఎజెండానా?. తెలుగు దేశం, బీజేపీ, జనసేనను కలపడమే పవన్‌ రోడ్‌ మ్యాప్‌?. ఇందుకోసమే మీకు ప్యాకేజీ ఇచ్చేది. ప్యాకేజీ ఎక్కడ మిస్‌ అవుతుందా అని ప్రెస్‌ ముందు మీ ముఖ కవలికలే చెబుతుయని ఎంపీ మార్గాని భరత్‌ పవన్‌పై మండిపడ్డారు. 

 

Back to Top