స్ట్రాబెర్రీ సాగుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం

ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌కు సీఎం ఆదేశం

విశాఖ ఏజెన్సీలో పండించిన స్ట్రాబెర్రీలు సీఎంకు అందజేసిన ఎంపీ మాధ‌వి

తాడేపల్లి: విశాఖ ఏజెన్సీ స్ట్రాబెర్రీ సాగుకు అనుకూలంగా ఉన్నందున పెద్ద ఎత్తున సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ మాధవి కోరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పండించిన స్ట్రాబెర్రీ పండ్లను అందించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా ఏజెన్సీలోని చింతపల్లి మండలం లంబసింగి పరిసర గ్రామాల్లో రైతులు స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారన్నారు. విశాఖ ఏజెన్సీ స్ట్రాబెర్రీ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే.. పర్యాటకంగా కూడా మరింత అభివృద్ధి చెందుతుందని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ను విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ మాధవి చెప్పారు. ఈ మేరకు సీఎం వైయస్‌.జగన్‌ సానుకూలంగా స్పందించారన్నారు. గిరిజన రైతులకు ఆదాయ వనరులు పెంపొందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం సూచించారని చెప్పారు.
 

Back to Top