వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థిపై టీడీపీ నేతల దాడి

చిత్తూరు: పులివర్తివారిపల్లెలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థి రెడ్డప్పపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తమ గ్రామంలో ప్రచారం చేయొద్దంటూ రెడ్డప్పను అడ్డుకొని, వాహనంపై దాడి చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీ పోలింగ్‌కు ఈసీ ఆదేశించింది. ఈ క్రమంలో నిన్న టీడీపీ నేతలు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఇవాళ ఎంపీ అభ్యర్థి రెడ్డప్పపై దౌర్జనం చేశారు.
 

Back to Top