ప్రాణం ఉన్నంత వరకు సీఎం వైయస్‌ జగన్‌తోనే..

నాపై తప్పుడు వార్తలు రాసిన వారిపై కేసులు పెడతా 

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద రావు

తిరుపతి: ప్రాణం ఉన్నంత వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని, సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే పనిచేస్తానని ఎంపీ బల్లి దుర్గాప్రసాద రావు అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లుగా ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద రావు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై ఎల్లో మీడియా కక్ష కట్టిందని, తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. చంద్రబాబే ఎల్లో మీడియాతో నాటకం ఆడిస్తున్నారని ఫైరయ్యారు. ‘నా ప్రాణం ఉన్నంత వరకు వైయస్‌ఆర్‌ సీపీని వీడను’ అని ఎంపీ దుర్గాప్రసాద రావు స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు రాసిన వారిపై కేసులు పెడతానని హెచ్చరించారు. 
 

Back to Top