సద్గుణుడి పాలనకు ప్రకృతి సహకరించింది

సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో ప్రాజెక్టులకు జలకళ

ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి సహకరించండి

సీపెట్‌ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి సదానందగౌడ్‌ను కోరిన ఎంపీ బాలశౌరి

 

గన్నవరం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని, ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుందని ఎంపీ బాలశౌరి అన్నారు. రాజ్యాన్ని పాలించే రాజు మంచివాడు, సద్గుణుడు అయితే ప్రకృతి కూడా సహకరిస్తుందని పురాణాలు చెబుతున్నాయని, గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో అది నిరూపణ అయ్యిందని, మళ్లీ ఆయన తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత వరుణుడు కరుణించాడన్నారు. గన్నవరం మండలం సూరంపల్లిలో సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ భవన ప్రారంభోత్సవ సభలో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సూరంపల్లిలో సీపెట్‌ ఏర్పాటు మంచిపరిణామం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సహకరించాలని ప్రారంభోత్సవ సభకు హాజరైన కేంద్రమంత్రి సదానందగౌడ్‌ను కోరారు.

వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే వర్షాలు బ్రహ్మాండంగా కురిసాయని, 20 సంవత్సరాలుగా నిండని డ్యాములన్నీ జలకళతో ఉన్నాయని, కృష్ణానది నుంచి దాదాపు 650 టీఎంసీలు సముద్రంలోకి పంపించామని కేంద్రమంత్రికి కన్నడలో వివరించారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో పులిచింతల ప్రాజెక్టు నిండిందన్నారు. రైతులు రెండో పంటకు సిద్ధంగా ఉన్నారని, దానికి సంబంధించి ఎరువులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదని గుర్తుచేశారు. అదే విధంగా రాష్ట్రంలో 5 వేల మెగావాట్ల థర్మల్‌ ప్రాజెక్టులు ఉన్నాయని, కోల్‌ కేటాయించాలని కోరారు. పెట్రో కారిడార్‌ రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, ఈ విషయంలో కూడా సహకరించాలని ఎంపీ బాలశౌరి కన్నడ భాషలో కేంద్రమంత్రిని కోరారు.

Read Also: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నారా లోకేశ్.. ఇదే చంద్రబాబు స్కెచ్

తాజా వీడియోలు

Back to Top