చంద్ర‌బాబు దొంగ‌ల‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తే...

సీఎం వైయ‌స్ జగన్‌పై ప్రశంసలు కురిపించిన మహ్మద్‌ ఇక్బాల్‌
 

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి కేబినెట్‌లోనే మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవి ఇవ్వడం పట్ల  వైయ‌స్ఆర్‌సీపీ నేత మహ్మద్‌ ఇక్బాల్‌ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఓట్ల కోసం చివరలో మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో దొంగలు, బ్యాంక్‌ లూటీ చేసిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే.. వైయ‌స్ జగన్‌ మాత్రం ఓడిపోయిన తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారన్నారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డి వలనే మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. వైయ‌స్‌ హయాంలో మైనార్టీలకు ఎలాంటి సంక్షేమం జరిగిందో సీఎం వైయ‌స్‌ జగన్‌ సారథ్యంలో కూడా అలానే జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top