తాడేపల్లి: ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు కబ్జా చేస్తే.. రాష్ట్రంలోని విలువైన భూమల్ని రామోజీరావు కబ్జా చేశారని, కబ్జాల్లో చంద్రబాబు, రామోజీరావు ఇద్దరూ దొందు దొందే అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ, తెలుగు దోపిడీ పార్టీ అని ధ్వజమెత్తారు. విశాఖపట్టణంలోని వైయస్‌ఆర్ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ శ్రీమతి వరుదు కళ్యాణి మీడియాతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కళ్యాణి ఇంకా ఏమన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగా కష్టపడుతున్నారనేది అందరికీ తెలుసు. ప్రధానంగా విశాఖపట్టణాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయడానికి ఎంతగానో కృషిచేస్తున్నారు కనుకే ఉత్తరాంధ్ర ప్రజలు వైయస్ జగన్‌కి నీరాజనం పడుతోన్నారు. దానికి ఉదాహరణే మొన్న జరిగిన ‘సిద్ధం’ సభను చెప్పుకోవచ్చు. జనం తండోపతండాలుగా వచ్చి జగనన్నకు తమ మద్ధతు తెలియజేసి వారి పట్ల అభిమానాన్ని తెలియజేశారు. 2024 వన్స్‌మోర్ అని ఉత్తరాంధ్ర ప్రజలు డిసైడై ఉన్నారు. అందుకే.. విశాఖపై విషం కక్కుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలకు మొన్నటి దాకా ఉన్న ఆశలు కూడా వైఎస్‌ఆర్‌సీపీ సిద్ధం సభతో పటాపంచలయ్యాయి. ఖచ్చితంగా మరలా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తోందనేది వారికి అర్ధమైపోయింది. అందుకే, వారు విశాఖపట్టణం మీద విషం చిమ్మడం ప్రారంభించారు. అందులో భాగంగా ఈరోజు ఈనాడు పత్రికలో మా విశాఖ మీద పిచ్చిపిచ్చి రాతలు రాసి ఇక్కడి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు.. అందులోనూ విశాఖ ప్రజలు అంత అమాయకులు కారని చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే పచ్చమీడియా పత్రికలు, ఛానెళ్లు తెలుసుకుంటే మంచిది. కబ్జాల్లో చంద్రబాబు, రామోజీ దొందూ దొందే.. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు కబ్జా చేస్తే.. ఈనాడు రామోజీరావు విశాఖలో ఒక ఆఫీసు, విజయవాడలో మరొక ఆఫీసును అద్దెకు తీసుకుని ఏకంగా వాటిని కబ్జా చేయడానికి పాల్పడ్డాడు. అంటే, కబ్జా భాగోతాల్లో వీరిద్దరూ దొందూ దొందేనని చెప్పాలి. రామోజీరావు ఎంత నీచుడంటే, లీజుకు తీసుకున్న భూములకు సంబంధించిన టీడీఆర్ బాండ్లు తనవి అని లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఈ వైనంతో ఆయనెంత కబ్జాకోరో.. ఇతరుల ఆస్తుల్ని కాజేసేందుకు ఎంత దిగజారుతాడో ఆంధ్రరాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. గీతం భూకబ్జాలపై ఈనాడు రాతలేవి..? బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్ కాగా, మరో అల్లుడు గీతం భర™Œ ఆధ్వర్యంలో విశాఖలో ఎన్ని వందల ఎకరాల భూములు కబ్జాలకు గురయ్యాయో అందరికీ తెలుసు. గీతం కాలేజీకి సంబం«ధించిన భూముల వివాదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు అధికారంలో ఉండగా, విశాఖ ప్రజలు తండోపతండాలుగా పోలీసు స్టేషన్ల చుట్టూ తమ భూముల్ని ఆక్రమించారంటూ కంప్లైంట్‌లు ఇవ్వడం జరిగింది. ఏకంగా 2,500 ఫిర్యాదులు గత ప్రభుత్వ హయాంలో ఒక్క విశాఖ ప్రాంతం నుంచే పోలీసుశాఖకు అందాయంటే.. అప్పట్లో టీడీపీ నేతల భూకబ్జా అరాచకాలు ఎంతగా ఉండేవో అందరూ తెలుసుకోవచ్చు. అప్పట్లో మంత్రిగా పనిచేసిన అయ్యన్నపాత్రుడు తన తోటి మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు దాదాపు 1700 ఎకరాల్ని విశాఖలో కబ్జా చేశారని బహిరంగంగా విమర్శించాడు. మరి, అప్పుడెందుకు ఈనాడు దినపత్రిక ఆ విషయాన్ని తాటికాయంత అక్షరాల్లో రాయలేదు..?. ఇప్పుడు లేనివాటì పై ఎందుకు కథనాలు రాసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు..? టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ విశాఖ నగరంలో ఎక్కడైనా తమ భూమిని కబ్జా చేశారనే ఫిర్యాదు ఇప్పుడు కనిపించిందా..? మీకెవరైనా మీడియా ముందుకొచ్చి చెప్పారా..? విశాఖలో పెద్ద ఎత్తున భూకబ్జాలు, ఆక్రమణలు జరిగినట్లు నిజంగా మీరు నమ్మితే కోర్టులను ఆశ్రయించు వచ్చుకదా..? ఎందుకు అబద్ధపు రాతలు రాస్తారు..? అసలు, తెలుగుదేశం పార్టీ అంటేనే.. తెలుగు దొంగల పార్టీగా ప్రజలందరికీ తెలుసు. తెలుగు దౌర్జన్యాలకు, తెలుగు దోపిడీలకు కేరాఫ్‌గా ఆ పార్టీని చెప్పుకుంటారు. అలాంటిది, మీరే దొంగ దొంగ అని అరిచినంత మాత్రానా ఏం సాధిస్తారు..?నిజానికి గత ప్రభుత్వహయాంలో తెలుగుదేశం పార్టీ నేతలు అక్రమంగా కబ్జా చేసిన విలువైన భూములన్నింటినీ గుర్తించి ప్రభుత్వం వాటిని మరలా వెనక్కి తీసుకుని సంరక్షిస్తోంది. అది నచ్చని ఆ పార్టీ నేతలు తమ పచ్చమీడియా ద్వారా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. 430.58 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కాపాడాం జగనన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక, విశాఖపట్టణం జిల్లా మండలాలవారీగా చూస్తే.. అనకాపల్లి 2.3 ఎకరాలు, ఆనందపురంలో 104 ఎకరాలు, అచ్యుతాపురంలో 0.28 ఎకరాలు, భీమునిపట్నంలో 58 ఎకరాలు, గాజువాకలో 50 ఎకరాలు, గోపాలపట్నం, నర్సీపట్నం, కశిం కోట, పద్మనాభం, పరవాడలో సుమారు 32 ఎకరాలు, పెద్ద గంతేడులో 4.4ఎకరాలు, పెందుర్తితో 16 ఎకరాలు .. ఇలా మొత్తం 430.58 ఎకరాల్ని తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్త కబ్జా చేస్తే.. ఎన్నికలయ్యాక వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వాటిని తిరిగి వెనక్కి తీసుకుంది. ప్రజల పక్షాన పనిచేస్తోన్న ప్రభుత్వ చర్యలు జీర్ణించుకోలేకనే ఈనాడు సంస్థ పనిగట్టుకుని రోజుకో విషయంపై ప్రభుత్వం మీద బురదజల్లుతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రదాత వైయస్ జగన్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి భోగాపురం ఎయిర్‌పోర్టు, ఇన్ఫోసిస్, ఇనార్బిట్ మాల్ తెచ్చారు. అదానీ డేటా సెంటర్ వచ్చింది. అలాగే, ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. అచ్యుతాపురంలో ఎకహోమా కంపెనీని జగనన్న గారే స్వయంగా వచ్చి ప్రారంభించారు. ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజీలు నిర్మాణమవుతూ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. కలలో కూడా ఊహించని స్థాయిలో మూలపేట పోర్టును కడుతున్నారు. ఈ మూలపేట పోర్టు పూర్తిగా అందుబాటులోకి వస్తే.. ఉత్తరాంధ్ర ప్రాంత ముఖచిత్రమే మారిపోతోంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం లేకుండా దిక్కుతోచకుండా ఉన్నటువంటి ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులకు జగనన్న ఒక భరోసానిచ్చి ప్రత్యేక ప్రాజెక్టుతో వారికి శాశ్వత పరిష్కారం చూపారు. రూ.700 కోట్లతో తాగునీటి పథకాన్ని తేవడంతో పాటు మరో రూ.85 కోట్లతో 200 పడకల ఆస్పత్రి, క్యాన్సర్ రీసెర్జీ సెంటర్‌ను తీసుకొచ్చి ఉద్దానం ప్రాంత ప్రజలకు ఒక శాశ్వత పరిష్కారం చూపారు. చంద్రబాబు, రామోజీల పెత్తందారీపోకడకు బుద్ధిచెబుతారు సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించి.. ఉత్తరాంధ్రను ఈ రాష్ట్ర పరిపాలనా రాజధానిగా చేయడానికి జగనన్న పూనుకున్నారు. అదే చంద్రబాబు నేతృత్వంలో నడుస్తున్న వారు మాత్రం ఉత్తరాంధ్రను అణగదొక్కేందుకే చూస్తున్నారు. ప్రజల ఆస్తుల్ని కాపాడే విషయంలో దీక్షతో పనిచేస్తోన్న గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చర్యలతో ఓర్చు కోలేని చంద్రబాబు, ఈనాడు రామోజీరావు కూడబలుక్కుని ఇష్టానురాతలు రాస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ వారే భూకబ్జాలకు ఆరితేరినవారని ఊరందరికీ తెలిసిన విషయమే. ఈ సంగతిని ప్రజలంతా పూర్తిగా అర్ధం చేసుకున్నారు గనుకే ఈనాటికీ జగనన్నకి అండగా నిలిచి మద్ధతిస్తోన్నారు. మరో రెండుమూడ్నెల్లలోనే చంద్రబాబు, రామోజీరావుల పెత్తందారీ పోకడలకు తగిన బుద్ధి చెప్పేలా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.