ప్ర‌జ‌ల‌ను మభ్య‌పెడుతున్న కూట‌మి స‌ర్కార్‌

ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ ఫైర్  
 

 అమరావతి:  ఎన్నికల హామీల అమలు విషయంలో.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ, శాస‌న మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం శాసన మండలిలో చర్చ  సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ఆయ‌న నిలదీశారు.

‘‘దీపం-2 పథకాన్ని తప్పు దోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ పథకానికి బడ్జెట్‌లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. ఎన్నికలకు ముందు ఈ పథకంపై విపరీతమైన హామీలిచ్చారు. ఎన్నికలయ్యాక అధికారంలో వచ్చి ఇప్పుడు మెలిక పెడుతున్నారు.  

ఆర్థిక మంత్రి ఒకలా.. సివిల్‌ సప్లై మంత్రి మరోలా దీపం-2 గురించి మాట్లాడుతున్నారు. ప్రజలను మభ్య పెట్టి అధికారంలో వచ్చింది.  ఇప్పుడు నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు వెంటనే అమలు చేయాలి.

చేతిలో అధికారం ఉందని విద్యుత్‌ ఛార్జీలు పెంచుకుంటూ పోతామంటే కుదరదు. మా ప్రభుత్వ హయాంలో కూడా డిస్కంలకు సబ్సిడీ ఇచ్చాం.  తల్లికి వందనం 18 వేలు ఇస్తామన్నారు?  ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదు? అని బొత్స ప్రశ్నించారు.

ఇది ప్ర‌జా వ్య‌తిరేక బ‌డ్జెట్‌
నేరస్తులకు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై భయం పోయింది. నేరస్తులు రాష్ట్రంలో తీవ్రంగా నేరాలకు పాల్పడుతున్నారు. మా హయాంలో పెట్టుబడి వ్యయం చేయలేదని అన్నారు. మరి నాలుగు పోర్టులు, ఎయిర్ పోర్టు, మెడికల్ కాలేజీలు నిర్మాణం ఎలా జరిగాయి? అవి క్యాపిటల్ వ్యయం కాకుండా హాం ఫట్ అంటే వచ్చాయా? ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అంటూ బొత్స విమ‌ర్శించారు. 

Back to Top