ఇసుక దొంగే దీక్షలు చేయడం విడ్డూరం

ఇసుక దొంగ దేవినేని ఉమా

 వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌

తాడేపల్లి: ఇసుక దొంగే దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ విమర్శించారు. ఇసుక బకాసురులే ఇసుక కోసం దీక్ష చేస్తున్నారని, దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా చంద్రబాబు దీక్ష ఉందన్నారు. దేవినేని ఉమా ఆధ్వర్యంలో చంద్రబాబు దీక్ష హాస్యాస్పదమన్నారు. దేవినేని ఉమా మహేశ్వరరావు అనే వ్యక్తి ఎంత పెద్ద దొంగో అందరికి తెలుసు అన్నారు. ఆ ఇసుక దొంగ మా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ఛార్జ్‌షిట్‌ అబద్దాల పుట్ట అన్నారు. వరదలు, ప్రకృతి వైఫరిత్యాల కారణంగానే ఈ రోజు ఇసుక కొరత ఉందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఈ కొరతను తీర్చేందుకు ఇసుక వారోత్సవాలు చేపట్టి అందరికి అందుబాటులోకి తెచ్చారన్నారు. గత ఐదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలే అన్నారు. ఏ సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకపోవడంతో ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. చంద్రబాబుకు మతిభ్రమించి ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు.  చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. దేవినేని ఉమా మంత్రిగా ఉన్న సమయంలో కృష్ణానదిలో ఇసుకను యంత్రాలు పెట్టి తొడుకున్నారని, ఇందుకే గదా గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ ఏపీకి రూ.100 కోట్లు జరిమానా విధించిందన్నారు.  దేవినేని ఉమా విధానాలు నచ్చక టీడీపీ నేతలు, ఆయన సొంత తమ్ముడే వైయస్‌ఆర్‌సీపీలోకి వచ్చారని తెలిపారు. 

 

Read Also: చంద్రబాబు-పవన్‌ ఇద్దరూ ఒక్కటే

తాజా ఫోటోలు

Back to Top