మార్పు కోసం ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలి

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా

ఓటమి భయంతోనే బాబు అరాచకాలు సృష్టిస్తున్నారు

చిత్తూరు: మార్పు కోసం ప్రజలు ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. చంద్రబాబు తన అనుభవాన్ని దోచుకునేందుకు ఉపయోగించారని విమర్శించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును త్వరలోనే ఇంటికి పంపుతామని ప్రజలు చెబుతున్నారని చెప్పారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం రాష్ట్రానికి ఎంతో అవసరమని, మార్పు కోసం ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలని కోరుతున్నట్లు చెప్పారు. 2014లో చంద్రబాబుకు ఓటేసి తప్పు చేశారని, అనుభవం ఉందని ఓటేస్తే మోసం చేశారని ప్రజలు రగిలిపోతున్నారన్నారు.

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని ఆమె పేర్కొన్నారు. ఆ భయంతోనే చంద్రబాబు అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీలను మూయించి రైతుల పొట్ట కొట్టిన చంద్రబాబు..ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని రోజా ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా, తాను ఇచ్చిన మాట కోసం ఆయన పడుతున్న తపన ప్రజలు గమనిస్తున్నారని, ప్రజల కోసం ఆయన పోరాటం చేస్తున్న విధానం ప్రజలకు నచ్చిందన్నారు. ప్రత్యేక హోదా తెస్తారని యువత భావిస్తున్నారన్నారు. చంద్రబాబు వస్తే కరువు వస్తుందని అందరికి తెలుసు అన్నారు. అందుకే వైయస్‌ జగన్‌ రావాలని, ఆయన కావాలని ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారని ఆర్కే రోజా పేర్కొన్నారు. 
 

Back to Top