విజయవాడ: అమరావతిలో చంద్రబాబు ఏమి చేయలేదని ఈ ప్రాంత ప్రజలు అర్థం చేసుకున్నారు కనకే ఇవాళ చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రక్షణనిధి పేర్కొన్నారు. చంద్రబాబు ముఖం చూడటానికి కూడా రాజధాని రైతులు ఇష్టపడటం లేదన్నారు. రైతుల భూములను బలవంతంగా లాక్కుని మోసం చేసిన చంద్రబాబు ఇవాళ ఎలా పర్యటిస్తారన్నారు. ఆయన ఏమీ చేయలేదు కాబట్టే మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించారన్నారు. చంద్రబాబు ఐదేల్లు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. రాజధానిలో ఆయన కట్టింది ఏమీ లేదని,అన్ని కూడా తాత్కాలిక కట్టడాలే కాబట్టి ప్రజలు చంద్రబాబును ఈ ప్రాంతానికి రాకుండా రైతులు అడ్డుకుంటున్నారని ఆయన తెలిపారు. Read Also: రాజధాని అవినీతిపై విచారణ చేపట్టాలి