గౌతమ్‌ అన్న ఆశయాలను నెరవేరుస్తా

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి  ప్రమాణ స్వీకారం
 

అమరావతి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆశయాలను నెరవేరుస్తానని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో 82,888 ఓట్ల మెజార్టీతో ఇటీవల గెలిచిన విక్రమ్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. 

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ సాధించిన సంగతి తెలిసిందే. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో  మేకపాటి విక్రమ్‌ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ డిపాజిట్‌ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్‌ రెడ్డి చిత్తుగా ఓడించారు.

ఆత్మకూరు ఉప ఎన్నిక‌లో మేక‌పాటి విక్రమ్‌రెడ్డికి ఘ‌న విజ‌యాన్ని అందించిన ఆత్మకూరు నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి కృత‌జ్ఞత‌లు తెలిపారు. “ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా.. ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్ర‌మ్‌ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి.. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు.. పేరుపేరునా ధన్యవాదాలు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష“ అని సీఎం వైఎస్ జ‌గ‌న్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
 

Back to Top