విజయవాడ: ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. అనుభవం ఉందని ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఐదేళ్లు రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నాడని, చంద్రబాబు చేసిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. విజయవాడలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లుతున్నాడని, బాబు అండ్ కో దుర్మార్గాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలన్నీ ఆధారాలతో సహా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. ఇన్ని కుంభకోణాలకు పాల్పడిన చంద్రబాబును ప్రజలు ఎప్పటికీ విశ్వసించరన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనంతా అవినీతితో నిండిపోయిందన్నారు. మేనిఫెస్టోలో హామీలన్నీ అమలు చేస్తూ సీఎం వైయస్ జగన్ ప్రజా నాయకుడిగా ఎదిగారన్నారు. 98 శాతం సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైయస్ జగన్‌కే దక్కిందన్నారు. 2024లో కూడా చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.