విజయవాడ: చంద్రబాబు అవినీతి చేయడం మూలంగానే జైలుకు వెళ్లాడని చెప్పకుండా మైండ్ బ్లాంక్ అయ్యి బాలకృష్ణ ఏదేదో మాట్లాడుతున్నాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు చేసిన తప్పు గురించి ఎందుకు మాట్లాడటం లేదని బాలకృష్ణను ప్రశ్నించారు. విజయవాడలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విలేకరులతో మాట్లాడారు. తన బావ తప్పు చేశాడని, అవినీతికి పాల్పడ్డాడని, చేసిన స్కాముల మూలంగానే జైలుకు వెళ్లాడని బాలకృష్ణ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు పాత్ర ఏంటో బాలకృష్ణకు బాగా తెలుసన్నారు. ఎన్టీఆర్ పార్టీని, సీఎం కుర్చీని లాక్కోవడం, పదవి నుంచి దించడంలో చంద్రబాబు, బాలకృష్ణ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. బాలకృష్ణ మైండ్ బ్లాంక్ అయ్యి మాట్లాడుతున్న మాటలు ఎవ్వరికీ అర్థం కావడం లేదన్నారు. సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు.