బాబు దేవాలయాలు కూలదోస్తే..సీఎం వైయస్‌ జగన్‌ నిర్మిస్తున్నారు

అర్చకుల మేలు గురించి ఏనాడైనా చంద్రబాబు ఆలోచించారా?

రూ.150 కోట్లు లంచం తీసుకున్నది ఎవరో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి

చంద్రబాబు జిరాక్స్‌ కాపీనే పవన్‌ కళ్యాణ్‌ 

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

తాడేపల్లి: చంద్రబాబు హయాంలో దేవాలయాలను కూలదోస్తే..సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వాటిని నిర్మిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ కళ్యాణ్‌ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కుట్రతో సీఎం వైయస్‌ జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే యత్నంలో మేముంటే చంద్రబాబు అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు సామాన్యులకు మేలు చేయాలనే ఆలోచనే రాలేదన్నారు. ఐదు నెలల కాలంలో సీఎం వైయస్‌ జగన్‌ అనేక సంక్షేమ పథకాలు తెచ్చారని ఆయన తెలిపారు.ప్రభుత్వంపై బురద జల్లాలనే అన్యమత ప్రచారం ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో వెంకటేశ్వరస్వామిని కూడా వెంకన్న చౌదరిగా పిలిచారని తెలిపారు. విజయవాడ దుర్గ గుడిలో క్షుద్రపూజలు చేశారని గుర్తు చేశారు. రాజమండ్రి పుష్కరాల్లో బాబు ప్రచారం కోసం భక్తుల ప్రాణాలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో 40 దేవాలయాలను కూలగొట్టారని దుయ్యబట్టారు. అర్చకుల మేలు గురించి ఏనాడైనా చంద్రబాబు ఆలోచించారా అని ప్రశ్నించారు. జీవో నంబరు 76ను ఎందుకు అమలు చేయలేదని విష్ణు నిలదీశారు. చంద్రబాబుకు మానవత్వం, సభ్యత లేదని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ కళ్యాణ్‌ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జిరాక్స్‌ కాపీనే పవన్‌ కళ్యాణ్‌ అని విమర్శించారు. ఏపీ భ్రష్టు పట్టడానికి చంద్రబాబు, టీడీపీనే కారణమని తెలిపారు.గత ఎన్నికల్లో ఓడినా టీడీపీ నేతలకు బుద్ధి రాలేదని హెచ్చరించారు. కాంట్రాక్ట్‌ పనిలో రూ.150 కోట్లు లంచం తీసుకున్న నేత ఎవరో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. సోషల్‌ మీడియాలో మితిమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
 

Read Also: చంద్రబాబు రాజకీయ చరిత్ర అందరికీ తెలుసు

తాజా ఫోటోలు

Back to Top