చంద్రబాబు రాజకీయ చరిత్ర అందరికీ తెలుసు

ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి

విజయనగరం: చంద్రబాబు రాజకీయ చరిత్ర అందరికీ తెలుసు అని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఎన్‌టీఆర్‌ నుంచి సీఎం పీఠాన్ని లాక్కున్న ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టే ఆలోచనలు టీడీపీ మానుకోవాలని హితవు పలికారు.విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా ఇంగ్లీస్‌ మీడియాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెప్పారు. నారాయణ సంస్థలకు ఆదాయం తగ్గిపోతుందనే టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలకు పూర్తిస్థాయి రిజర్వేషన్లు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.2020 ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. జనసేన దారి ఎటువైపో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందన్నారు.

Read Also: ప్రత్యేక హోదానే ప్రధాన ఎజెండా

  

Back to Top