హిందూధర్మాన్ని వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కాపాడుతోంది

చంద్రబాబు కూల్చిన దేవాలయాలను మా ప్రభుత్వం నిర్మిస్తోంది

అసెంబ్లీలో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

అసెంబ్లీ: హిందూధర్మాన్ని వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కాపాడుతోందని, మూడున్నర సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేసిందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు కూల్చేసిన ఆలయాలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పునర్‌ నిర్మిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కరోనా సమయంలో అర్చకులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదుకున్నారని, 17,500 మంది అర్చకులకు నెల‌కు రూ.5 వేల చొప్పున రూ.35 కోట్లను వారి అకౌంట్లలో జమ చేశారని చెప్పారు. అర్చకులకు సంబంధించిన కొన్ని సమస్యలను పరిష్కరించాలని సంబంధిత మంత్రిని కోరారు. గ్రామాల్లోని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు, ఆగ్రామాల్లో అర్చకులు నివసించేందుకు కొన్నికొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు. అదే విధంగా వంశపారంపర్యానికి సంబంధించిన జీవో 439 జారీ చేసిన సందర్భంలో అర్చకుల నమోదు సమయంలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటిని కూడా పరిష్కరించాలని కోరారు. 

Back to Top