ఎల్లుండి గుంటూరుకు మాజీ సీఎం వైయస్‌ జగన్

టీడీపీ రౌడీల దాడికి గురైన అంబటి కుటుంబానికి పరామర్శ

శుక్రవారం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్‌ను పరామర్శించనున్న వైయస్‌ జగన్

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ రౌడీల చేతిలో హత్యాయత్నానికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా విధ్వంసానికి గురైన అంబటి రాంబాబు నివాసాన్ని శ్రీ వైయస్ జగన్ పరిశీలించనున్నారు. అనంతరం అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలుసుకుని ధైర్యం చెప్పి, వారికి అండగా వైయ‌స్ఆర్‌సీపీ నిలుస్తుందని భరోసా ఇవ్వనున్నారు.

శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను, ఆయన కుటుంబ సభ్యులను కూడా శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. ఇటీవల జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. అధికార టీడీపీ నేతలు, గూండాల దాడులతో ప్రజల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

Back to Top