మాజీ మంత్రి జోగి రమేష్‌ను పరామర్శించిన ఎమ్మెల్సీ తలశిల రఘురాం

ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి, సీనియర్ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత  జోగి రమేష్ ను ఎమ్మెల్సీ శ్రీ తలశిల రఘురాం  ప‌రామ‌ర్శించారు. నిన్న జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో ఆయనను పరామర్శించిన తలశిల రఘురాం , ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.  ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన సమయంలో ప్రశ్నించే గొంతులను అణిచివేసేలా జరుగుతున్న దాడులు ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తలశిల రఘురాం మాట్లాడుతూ, జోగి రమేష్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్నాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్  మాట్లాడుతూ, ప్రజల తరఫున నిలబడి ప్రశ్నించడం తమ బాధ్యతని, దాడులు, బెదిరింపులతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టలేరని అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ భేటీలో పలువురు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

Back to Top