ఫిషింగ్ హార్బర్ల పనులను పూర్తి చేయాలి

రాజ్య‌స‌భ‌లో ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి డిమాండ్‌

న్యూఢిల్లీ: వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హయాంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రారంభ‌మైన‌ ప్రారంభమైన ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని రాజ్యసభలో జీరో అవర్లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి  డిమాండ్ చేశారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం మత్స్యకారులకు అత్యంత ప్రయోజనకరమ‌ని, ఈ పనులపై ఆలస్యం జరుగుతుంటే మత్స్యకారులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద అవసరమైన నిధులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాల‌ని రఘునాథ్ కోరారు. ఆత్మనిర్భర, బ్లూ ఎకానమీ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు పూర్తయితే, మత్స్యకారుల ఆదాయాలు పెరుగుతాయ‌ని, కోస్తాంధ్ర ప్రాంత అభివృద్ధికి పెద్ద దోహదం అవుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు. 

Back to Top