మీరు కూల్చిన దేవాలయాలు మేము క్రమ పద్దతి లో తిరిగి నిర్మిస్తున్నాం

వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు

విజ‌య‌వాడ‌:  టీడీపీ-బీజేపీ ఉమ్మ‌డి ప్ర‌భుత్వంలో ఏపీలో కూల్చిన దేవాల‌యాల‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం క్ర‌మ ప‌ద్ధ‌తిలో తిరిగి నిర్మిస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు పేర్కొన్నారు. బీజేపీ నేత‌ల తీరుపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిప‌డ్డారు. గడప గడప లో సంక్షేమం తో పాటు సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించే దిశగా ప్ర‌భుత్వం ముందుకుపోతుంద‌న్నారు.ప్రతిపక్షాలు మా మీద బురద జల్లుతున్నార‌ని మండిప‌డ్డారు. బీజేపీ నేత‌లు సోము వీరాజు, సునీల్ దేవ దర్ హిందువులకు వ్యతిరేకంగా మా పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసిందని ఆరోపణలు చేయ‌డం స‌రికాద‌న్నారు. దీనిపై వ్యాఖ్యలు చేయడానికి వీరికి అర్హత లేదన్నా. తెలుగులో చేసిన ట్వీట్ కు నానా అర్థాలు తీయొద్దు. సోము వీర్రాజు కు పిచ్చి పట్టింద‌న్నారు. కన్నా దెబ్బకి ఆయన ఏమి మాట్లాడుతూన్నారో అర్థం కాకుండా ఉంద‌న్నారు.  ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బీజేపీ కి ప్రజలే బుద్ధి చెబుతార‌ని మ‌ల్లాది విష్ణు హెచ్చ‌రించారు.

Back to Top