రాజమండ్రి: ఆంధ్రరాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తామని, స్కిల్‌డెవలప్‌మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పనకు తోడ్పడతామనే ముసుగులో వందల కోట్ల ప్రజాధనాన్ని చంద్రబాబు నాయుడు లూటీ చేశాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సీమెన్స్ కంపెనీ ద్వారా రూ.3,300 కోట్ల స్కామ్‌కు చంద్రబాబు తెరతీశాడన్నారు. స్కామ్‌లు చేయడంలో, ప్రజాధనాన్ని లూటీ చేయడంలో ఎక్స్‌పర్ట్ అయిన చంద్రబాబు.. 2014లో ముఖ్యమంత్రి అయిన తరువాత స్కిల్‌డెవలప్‌మెంట్ ముసుగులో భారీ కుంభకోణానికి తెరతీశాడన్నారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు ‘స్కిల్ స్కామ్’ గురించి ఈ సందర్భంగా వివరించారు. ‘‘జర్మన్ బేస్డ్ సీమెన్స్ కంపెనీకి సంబంధించిన ఉన్నతాధికారితో కలిసి చంద్రబాబు స్కామ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో స్కిల్‌డెవలప్‌మెంట్‌కు సంబంధించి ఆరు క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో క్లస్టర్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీవ్, ఐదు టెక్నికల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి.. దీని కోసం సుమారు రూ.546 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అంచనాలను తయారు చేయించారు. ఆరు క్లస్టర్లకు గానూ దాదాపు 3,300 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ ఇది. సీమెన్స్ సంస్థ ప్రతినిధి సోమయాధ్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ 90 శాతం నిధులను గ్రాంటినైడ్ కింద సీమెన్స్ సంస్థ ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేస్తుందని, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడిగినట్టుగా.. (రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.371 కోట్లు.. సీమెన్స్ వాటా 3,300 కోట్ల రూపాయలు) ఒక ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై అప్పట్లో చంద్రబాబు కేబినెట్ హడావిడిగా తీర్మానించడం, ఆ తరువాత జీవోను కూడా వెంటనే విడుదల చేశారు. సీమెన్స్ కంపెనీతో పాటు దేశీయ సంస్థలను కూడా ఇందులో కలిపారు. పీవీఎస్‌పీ అనే కంపెనీ పేరును స్కిల్లర్ అని మార్చారు. దీంతో పాటు డిజైన్ టెక్ అనే కంపెనీ ఉన్నాయి. ఏపీ స్కిల్ కార్పొరేషన్ ఒకపక్క, పీవీఎస్‌పీ, డిజైన్‌టెక్, సీమెన్స్ ఈ నలుగురికి కలిపి ఒప్పందం చేసుకుంటున్నట్టు.. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేలా ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేయడం, ఒక్కో క్లస్టర్‌కు సుమారు రూ.546 కోట్ల చొప్పున మొత్తం మీద రూ. 3,300 కోట్లు ఖర్చు పెట్టేలా అందులో 90 శాతం నిధులను సీమెన్స్ కంపెనీ ఖర్చు చేసేలా, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతంగా రూ.371 కోట్లు ఖర్చు చేసేలా స్పష్టంగా క్యాబినెట్‌లో తీర్మానం చేసి, జీవోలో కూడా ఇవే అంశాలను పేర్కొన్నారు. క్యాబినెట్ తీర్మానంలో చేసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వం జారీ చేసిన జీవోలో∙అంశాలకు– మూడు కంపెనీలతో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేసుకున్న ఒప్పందానికి (ఎంవోయూ) రెండింటికీ పొంతనలేకుండా కనిపించింది. ఎంవోయూలో కేవలం ఆ రూ.371 కోట్లు ఫైనాన్సియల్ అసిస్టెంట్స్ కింద ఇస్తున్నాం తప్ప కాంట్రిబ్యూషన్ అనే పదం ఎక్కడా ఎత్తకుండా స్కామ్‌కు తెరతీశారు. 3,300 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తామని చెప్పిన సీమెన్స్ కంపెనీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.371 కోట్లకు సంబంధించి అప్పటి ఫైనాన్స్ డిపార్టుమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మీద చంద్రబాబు ఒత్తిడి తీసుకువచ్చారన్నారు.``