రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందుతాయన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే ఆర్థిక పరిస్థితి కుంటుపడిందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నదే వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఆర్‌డీఏను చంద్రబాబు రియలెస్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీగా మార్చేశారని మండిపడ్డారు. కృత్రిమ ఉద్యమంతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయంతో అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందుతాయన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ వద్దే రూ. 2 వేల కోట్ల అక్రమ సంపాదన దొరికితే.. చంద్రబాబు, లోకేష్ వద్ద ఎన్ని లక్షల కోట్ల అవినీతి సొమ్ము ఉందోనని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు, లోకేష్‌ల పాస్‌పోర్టులను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.