రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుది

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజం

అసెంబ్లీ: నివర్‌ తుపాన్‌ వల్ల నష్టపోయిన రైతులందరినీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకుంటారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి మూడు ఇళ్లలో ఒక ఇంటికి రైతు భరోసా సొమ్ము అందుతుందన్నారు. 50 లక్షల పైచిలుకు రైతులకు రూ.13500 సాయం అందిస్తున్నామన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ధ్వజమెత్తారు. రైతుల సంక్షేమం పట్ల చంద్రబాబుకు చిత్తుశుద్ధి ఉంటే 23 సీట్లే ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. 
 

Back to Top