ఉన్న‌త‌మైన రాజ‌ధానిగా విశాఖ అవ‌త‌రించ‌బోతోంది

ఉత్త‌రాంధ్ర ప్రాంతం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు రుణ‌ప‌డి ఉంటుంది

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల‌నేది సీఎం ధ్యేయం

ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు బుద్ధి తెచ్చుకుంటే మంచిది

వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్‌నాథ్

విశాఖ‌ప‌ట్నం: ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లంతా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి రుణ‌ప‌డి ఉంటార‌ని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల‌నేది ముఖ్య‌మంత్రి ధ్యేయ‌మ‌ని, ఆ దిశ‌గానే అడుగులు వేస్తున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్‌నాథ్ అన్నారు. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోద‌ముద్ర తెలిపిన నిన్న‌టి రోజు రాష్ట్ర చ‌రిత్ర‌లో చ‌రిత్రాత్మ‌క రోజు అని, ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ బిల్లు ఆమోద ముద్ర తెల‌ప‌డంపై 13 జిల్లాల ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌న్నారు. విశాఖ‌ప‌ట్నం జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్‌నాథ్ విలేక‌రుల స‌మావేశం  నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అండ‌గా ఉంటామ‌న్నారు. ఉత్త‌రాంధ్ర ప్రాంతం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను మ‌హాత్ముడిగా ప‌రిగ‌ణిస్తుంద‌న్నారు.రాష్ట్రం అన్ని ర‌కాలుగా అభివృద్ధి చెందాల‌నే ధ్యేయంతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముందుకెళ్తున్నార‌న్నారు. స్వతంత్ర్యం వ‌చ్చిన త‌రువాత ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి గుర్తింపును తీసుకువ‌చ్చిన నాయ‌కుడికి ఎల్ల‌ప్పుడూ  రుణ‌ప‌డి ఉంటామ‌న్నారు.

దేశంలోనే ఉన్న‌త‌మైన రాజ‌ధానిగా విశాఖ‌ప‌ట్నం అవ‌త‌రించ‌బోతుంద‌ని ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్‌నాథ్ ధీమా వ్య‌క్తం చేశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌ను దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఆద‌ర్శంగా తీసుకుంటున్నాయ‌న్నారు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని వికేంద్రీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించి చేసిన పాపాలు క‌డుక్కోవాల‌న్నారు. న్యాయ‌స్థానాల‌కు వెళ్లి అడ్డుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు ద‌య‌చేసి మానుకోవాల‌ని చంద్ర‌బాబును కోరారు. చంద్ర‌బాబు, లోకేష్ చేసే చేష్ట‌ల‌ను స‌మ‌ర్థిస్తున్న‌ టీడీపీ నేత‌లకు ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో అడుగుపెట్టే అర్హ‌త లేద‌న్నారు. చీక‌టి రోజు అనే మాట‌లు ద‌య‌చేసి మానుకోవాల‌ని, చంద్ర‌బాబు చేసిన జ‌య‌ప్ర‌ద‌మైన చీక‌టి రోజులు ఎన్నో ఈ రాష్ట్ర ప్ర‌జ‌లు చూశారన్నారు. రియ‌లెస్టేట్ కోసం ఆలోచ‌న చేసే నాయ‌కులంద‌రికీ నిన్న‌టి రోజు చీక‌టిరోజ‌ని, రాష్ట్ర అభివృద్ధి కోసం  ఆలోచ‌న చేసే నాయ‌కుల‌కు చ‌రిత్రాత్మ‌క‌మైన రోజు అని అన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top