పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేది సీఎం వైయస్‌ జగనే..

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి స్వప్నం పోలవరం

అసెంబ్లీలో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మి

అసెంబ్లీ: పోలవరం ప్రాజెక్టును దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిచేస్తారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మి అన్నారు. పోలవరం ప్రాజెక్టులపై శాసనసభలో జరిగిన చర్చలో ఎమ్మెల్యే ధనలక్ష్మి పాల్గొని మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును మొదలుపెట్టింది వైయస్‌ఆర్‌ అని, ఆ ప్రాజెక్టును పూర్తిచేసేది ఆ మహానేత తనయుడు సీఎం వైయస్‌ జగన్‌ అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి ఆంధ్రప్రదేశ్‌ సస్యశ్యామలం అవుతుందన్నారు. అంతేకాకుండా తక్కువ రేట్లకే 960 మెగావాట్ల జల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురాగలమన్నారు. ఇటువంటి ప్రాజెక్టును 1981లో అప్పటి సీఎం అంజయ్య శంకుస్థాపన చేశారని, మళ్లీ వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రాజెక్టు నిర్మాణానికి క్లియరెన్స్‌ అన్ని తీసుకొనివచ్చి అప్పటికే భూసేకరణ చేపట్టారన్నారు. 

వైయస్‌ఆర్‌ మరణం తరువాత పోలవరం ప్రాజెక్టును ఎవ్వరూ పట్టించుకోలేదు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్‌ను  దోచుకున్నారు. సోమవారం పోలవరం అనే పేరు పెట్టి కమీషన్లు పంచుకునే కార్యక్రమం చేశారు. ఆ మీటింగ్‌లకు ఆడవాళ్లను తీసుకెళ్లి జయము జయము చంద్రన్న అని పాటలు పాడించుకున్నాడు. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కింద ఆస్కార్‌కు నామినేట్‌ చేయాల్సిన సాంగ్‌ అని సోషల్‌ మీడియాలో ఆ పాట ట్రోల్‌ అయ్యింది. 

పోలవరం ప్రాజెక్టు అంటే 48 గేట్లు, స్పీల్‌ వే, కాఫర్‌ డ్యామ్, డయాఫ్రం వాల్‌ కాదు.  గిరిజన రైతుల త్యాగఫలం. రాష్ట్ర ప్రయోజనాల కోసం వారి ఊరును, జ్ఞాపకాలను త్యాగం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన 8 గిరిజన మండలాల్లో కూడా సుమారు 373 గ్రామాలు ప్రాజెక్టుకు ఎఫెక్ట్‌ అవుతున్నాయి. అందులో సుమారు లక్షా 6,006 కుటుంబాలు బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంది. పోలవరం ద్వారా సుమారు 1.67 లక్షల ఎకరాల భూమి పోతుంది. ఇందులో గిరిజన గ్రామాలు ఎక్కువ. 2014లో జాతీయ ప్రాజెక్టు అయ్యిందో అప్పటి నుంచి చంద్రబాబు, టీమ్‌ దోపిడీకి రెడీ అయ్యారు. ఏ వర్కులు చేస్తే పంచుకోవడానికి వీలుంటుందో వాటిని మాత్రమే చేశారు. పోలవరం అంటే వైయస్‌ఆర్‌.. వైయస్‌ఆర్‌ అంటే పోలవరం. ఆ ప్రాజెక్టు పూర్తిచేయాలన్నా.. ప్రజలకు న్యాయం చేయాలన్నా.. అది కేవలం సీఎం వైయస్‌ జగన్‌ మాత్రమే సాధ్యం అని ఎమ్మెల్యే ధనలక్ష్మి అన్నారు. 
 

Back to Top