సీఎం వైయ‌స్ జగన్‌ దమ్మున్న నాయకుడు..

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

 చిత్తూరు : అధికార వికేంద్రీకరణతోనే ఆంధప్రదేశ్‌ అభివృద్ధి చెందుతుందని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన అధికార వికేంద్రీకరణకు మద్దతుగా చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ఆదివారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజాసదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. నారావారిపల్లె పరిసర ప్రాంతాల్లో రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు వెల్లడించారు.

‘తుడా చైర్మన్‌గా ఉన్న సమయంలో (2007, 08) నారావారి పల్లెలో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. ఈ ఏడు నెలల్లోనే రూ.12 కోట్లతో ఇక్కడి పరిసర ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పనులు చేశాము. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే ఇంతమంది నేతలు నారావారి పల్లెకు వచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అధికార వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందే. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దమ్మున్న నాయకుడు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొంటున్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడే నాయకులు మా పార్టీలో లేరు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలంతా స్వాగతిస్తున్నరు కాబట్టే ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద మొత్తంలో ప్రజానీకం హాజరయ్యారు.’ అని అన్నారు.

వైయ‌స్ఆర్ వెలుగు..చంద్ర‌బాబు చీక‌టి
 దివంగత ముఖ్యంమంత్రి వైయ‌స్ఆర్‌ వెలుగు లాంటి వ్యక్తి అని   ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు. వెలుగు లాంటి వ్యక్తి వైఎస్సార్‌ అయితే.. చంద్రబాబు నాయుడు చీకటి లాంటి వ్యక్తి అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ అడుగు జాడలోనే సీఎం వైఎస్‌ జగన్‌ నడుస్తున్నారని అన్నారు. నమ్మిన సిద్ధాంతాకు కట్టుబడి పనిచేసే వ్యక్తి జగన్‌ అని ప్రశంసిచారు. మాట ఇస్తే మడమతిప్పని వ్యక్తి అని కానియాడారు. కేవలం అధికారం కోసమే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Back to Top