ఆర్యవైశ్యులపై జరుగుతున్న వేధింపులు వెంటనే ఆపాలి

టీడీపీ కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలి 

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్య నాయకులు

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర సమన్వయకర్త  సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన పార్టీ ఆర్యవైశ్య నాయకుల సమావేశం

సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పార్టీ కార్యాలయ ఇంచార్జ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పిఏసి మెంబర్ గుబ్బా చంద్రశేఖర్, పార్టీ సెక్రెటరీ & మున్సిపల్ వింగ్ ప్రెసిడెంట్ రేపాల శ్రీనివాస్,  వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, టీటీడీ మాజీ సభ్యుడు ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, విజయవాడ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌ మాజీ ప్రెసిడెంట్ విద్యాధరరావు, మహిళా నాయకురాలు సాయి బాల పద్మ, సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ సాంబశివరావు, కరుణాకర్, ఇతర సభ్యులు.

ఈ సమావేశంలో చర్చించిన అంశాలు...

రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్యవైశ్యుల పట్ల అన్యాయాలు, వివక్ష పెరిగినట్లు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాపార వర్గానికి వెన్నెముకగా నిలిచిన ఆర్యవైశ్యులను లక్ష్యంగా చేసుకుని అధికార యంత్రాంగం వేధింపులకు పాల్పడుతోందని ఫిర్యాదులు వస్తున్నాయి. చిన్న, మధ్య తరహా వ్యాపారాలపై అకారణ తనిఖీలు, అధిక జరిమానాలు, లైసెన్సుల విషయంలో జాప్యాలు వంటి చర్యల వల్ల అనేక మంది వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన వ్యాపార రంగానికి ప్రభుత్వం నుంచి భరోసా అందాల్సిన సమయంలో మరింత ఒత్తిడి తేవడం బాధాకరం.

గతంలో  వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్యవైశ్యులకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ఈ-బీసీ నేస్తం వంటి పథకాల ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నేరుగా ఆర్థిక సహాయం అందించింది నాటి ప్రభుత్వం. అలాగే వేలాది కుటుంబాలు ఆర్థికంగా బలపడేలా చర్యలు తీసుకున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు సంక్షేమ పథకాల లబ్ధి సరిగా అందడం లేదని ఆర్యవైశ్య  ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పరంగా కూడా ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అభిప్రాయం ఏర్పడింది. నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్లు, కమిటీల్లో ఈ వర్గానికి తగిన స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది.

అదేవిధంగా గత ప్రభుత్వం సమయంలో ఆర్యవైశ్య సత్రాల సంస్ధలకు శ్రీశైలంలో సత్రాల నిర్మాణ నిమిత్తం స్ధలాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ సత్రాల నిర్మాణం కొరకు స్ధల కేటాయింపులను రద్దు చేస్తూ జి.ఓ. జారీ చేయడం తీవ్ర నిరాశ కలిగించింది. ఈ నిర్ణయం ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసే హేయమైన చర్యగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

అలాగే ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం స్వయంగా ముందుకు రావాల్సింది పోయి, ఆర్యవైశ్య వర్గాల నుండి చందాలు వసూలు చేయడం దురదృష్టకరం. ఇలాంటి మహానీయుల విగ్రహాల ఏర్పాటును ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి.

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు:

  • ఆర్యవైశ్య వ్యాపారులపై జరుగుతున్న వేధింపులను వెంటనే నిలిపివేయాలి.
  • సంక్షేమ పథకాలను సమానంగా అమలు చేసి లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలి.
  • రద్దు చేసిన సత్రాల జి.ఓ.ను తక్షణమే పునరుద్ధరించాలి.
  • రాజకీయ మరియు నామినేటెడ్ పదవుల్లో ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.
  • పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేయాలి.
  • ఆర్యవైశ్య సమాజం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వర్గం. వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం, అభివృద్ధికి తోడ్పడటం ప్రతి ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్యవైశ్యుల న్యాయమైన అభ్యర్థనలను పరిష్కరించాలి.
Back to Top