వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి

బీ ఫారం అందజేసిన ఎంపీ విజయసాయిరెడ్డి
 

అమరావతి: ఎమ్మెల్యేల కోటాలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీ సంఘం అధ్యయన కమిటీ చైర్మన్‌ జంగా కృష్ణమూర్తిని పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మెహన్‌ రెడ్డి ఎంపిక చేశారు. ఈ మేరకు గురువారం జంగా కృష్ణమూర్తికి వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి బీఫారం అందజేశారు. ఈ నెల 25న జంగా కృష్ణమూర్తి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ఈ నెల 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం విధితమే. గతంలో వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 

Back to Top