అసెంబ్లీ: కరోనాతో భయపడే సమయంలో సీఎం వైయస్ జగన్ అందరిలో మనోధైర్యం నింపారని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ లేకపోయి ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లమని, ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరీ వారు సేవలు అందించారన్నారు. కరోనా సమయంలో సీఎం వైయస్ జగన్ 16 సార్లు రేషన్ అందించారన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనాకు భయపడి హైదరాబాద్‌లో దాక్కున్న జూమ్ బాబా.. ప్రజలకు సర్వీస్ చేస్తున్న తమను ఉన్మాది అన్నారని, ఎంత వరకు సమంజసమన్నారు.
చంద్రబాబు వయస్సు 75 కాబట్టి కరోనా వస్తుందనే భయంతో ఉన్నాడు.. ఆయన కొడుకు లోకేష్‌కు ఏమైంది.. గున్న ఏనుగు ఉన్నట్టు ఉన్నాడు వచ్చి ప్రజలకు సేవలు అందించొచ్చు కదా..? అని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయాలంటే మనసు ఉండాలని చురకంటించారు. కరోనా టైమ్‌లో కిట్‌లు దొరక్కపోయినా.. సీఎం వైయస్ జగన్ మరో దేశం నుంచి కిట్లు తెప్పించి పంపిణీ చేపించారన్నారు. క్లిష్ట పరిస్థితిలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. సీఎం వైయస్ జగన్ చెప్పిన గ్రీన్, రెడ్ జోన్ సలహానే ప్రధాని కూడా అమలు చేశారని గుర్తుచేశారు. టీటీడీ కల్యాణ మండపాలు, సత్రాల్లో వలస కూలీలకు భోజనాలు, వసతి కల్పించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.