ప‌వ‌న్ నిద్ర‌లేచే స‌రికే ప్ర‌భుత్వం వారికి అండ‌గా నిలిచింది

అగ్నిప్ర‌మాదంలో న‌ష్ట‌పోయిన మ‌త్స్య‌కారుల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే ఆదుకుంది

ప‌వ‌న్ మ‌త్స్య‌కారుల‌కు పంచిన డ‌బ్బుకంటే ఆయ‌న ప్ర‌యాణ ఖ‌ర్చే ఎక్కువ‌

డ‌బ్బులు లేవ‌ని చెప్పుకునే ప‌వ‌న్‌.. చార్టెడ్ ఫ్లైట్‌లో ఎలా వ‌చ్చాడు..?

దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో కూడా పవన్‌కు తెలియదు

నా ప్ర‌శ్న‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మాధానం చెప్ప‌గ‌ల‌డా..?

వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని

కృష్ణా: పవన్ క‌ల్యాణ్ మత్య్సకారులకు పంచిన డబ్బుకంటే ఆయన ఏపీకి వచ్చి వెళ్లిన విమానం ఖర్చే ఎక్కువ అని, త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ని చెప్పుకునే ప‌వ‌న్ చార్టెడ్‌ ఫ్లైట్‌లో ఎలా వచ్చాడ‌ని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ప్ర‌శ్నించారు. పవన్‌ కల్యాణ్ వ్యాఖ్య‌ల‌కు పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుతో కలిసి తప్పుడు ప్రభుత్వాన్ని నడిపిన వ్య‌క్తి నీతులు చెబుతున్నాడ‌ని, ఐదేళ్లలో తన అవసరాల కోసం చంద్రబాబు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడో ప‌వ‌న్‌ కళ్లకు కనిపించలేదా అని మండిప‌డ్డారు. పేర్ని నాని శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విషం చిమ్మడం పవన్‌కు అలవాటుగా మారిందన్నారు. ఏపీ ప్రజలకు మతిమరుపు చాలా ఎక్కువ అని పవన్ భావిస్తున్నాడ‌న్నారు. మత్స్యకారులకు సీఎం వైయ‌స్‌ జగన్‌ ఏమీ చేయడం లేదని పవన్ మాట్లాడుతున్నాడ‌ని, వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాకే 10 ఫిషింగ్‌ హార్బర్లు మంజూరయ్యాయ‌ని, వాటి నిర్మాణ ప‌నులు శరవేగంగా జరుగుతున్నాయ‌ని గుర్తుచేశారు. 

పవన్‌ నిద్రలేచే సరికే ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు సీఎం వైయ‌స్‌ జగన్‌ అండగా నిలిచారని పేర్ని నాని అన్నారు. పవన్‌ మాటలన్నీ పచ్చి దగాకోరు మాటలన్నారు. మ‌త్స్య‌కారుల‌కు సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం రూ.7కోట్ల 11లక్షల పరిహారం ఇచ్చిందని గుర్తుచేశారు. పవన్‌కు కావాలంటే ఎవరెవరికి డబ్బులు ముట్టాయో పేర్లతో సహా లిస్ట్‌ ఇస్తామ‌న్నారు. ఊపుకుంటూ వచ్చి రూ.50వేలు ఇచ్చి రూ.50కోట్లు ఇచ్చినట్టు ప‌వ‌న్ బిల్డ‌ప్ ఇస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు పేర్ని నాని స‌వాల్ విసిరారు.. 2014-19 వరకు ప‌వ‌న్, చంద్రబాబు కలిసి ఒక్క ఫిషింగ్‌ హార్బర్‌ అయినా కట్టారా సమాధానం చెప్పాలన్నారు.

ప్రజలను ఓటర్లుగా మాత్ర‌మే చూసే వ్యక్తులు చంద్రబాబు, పవన్ అని, కాపులను పవన్‌ ఏనాడైనా మనుషుల్లాగా చూశాడా? అని ప్ర‌శ్నించారు. కాపులను పెట్టుబడిగా, ఆస్తిగా, టోకుగా చంద్రబాబుకు బేరం పెట్టడానికే పవన్ చూస్తున్నాడని, ఓట్ల కోసం మాయ చేసి మోసం చేయడానికే చంద్రబాబు, పవన్‌ వస్తున్నారన్నారు. ఇంటెలిజెన్స్‌ ఆపితే విమానంలో ఎలా వచ్చావ్‌.. ఎలా వెళ్లావ్‌ పవన్‌? అని ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించారు. ప‌వ‌న్‌ శాస పీల్చేది.. వదిలేది చంద్రబాబు కోసమేన‌ని ఎద్దేవా చేశారు. చంద్రబాబును అధికారంలో చూడాలనే ఆకాంక్షతోనే పవన్‌ పనిచేస్తున్నాడని, ఇందులో భాగంగానే పవన్‌ పిట్టలదొర కబుర్లు చెబుతున్నాడన్నారు. ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో కూడా పవన్‌కు తెలియదని పేర్ని నాని సెటైర్లు వేశారు. 

ఈ సందర్బంగా ప‌వ‌న్‌కు పేర్ని నాని కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. చంద్రబాబు ఇంటి అవసరాల పేరుతో ఖర్చు చేసిన వివరాల చిట్టాను విప్పారు. వాటికి స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. 

ప్రశ్నలు ఇవే..
- చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే హైదరాబాద్ సచివాలయంలోని హెచ్ బ్లాక్‌కు ఏడు కోట్లు.
- వాస్తుబాగోలేదని ఎల్ బ్లాక్‌కు రూ.15 కోట్లు 
- లేక్ వ్యూలో క్యాంప్ ఆఫీస్ పెడతానని రూ.10 కోట్లు 
- చంద్రబాబు ఆఫీసులో కుర్చీలకు రూ.10 కోట్లు  
- మదీనాగూడలోని చంద్రబాబు ఫామ్ హౌస్‌కు రూ. 5 కోట్లు 
​​​​​​​- రోడ్ నెంబర్ 65లో చంద్రబాబు సొంతింటికి రూ.60 కోట్లు 
- రోడ్డు నెంబర్ 42కి ఇల్లు మారి అద్దె ఇల్లుకు రూ.50 కోట్లు ఖర్చు చేశాడు
- ఓటుకు నోటు కేసులో దొరికిపోయి చంద్రబాబు అర్ధరాత్రి బెజవాడ పారిపోయి వచ్చాడు  
- స్పెషల్ ఏసీ బస్సు కోసం రూ.6 కోట్లు  
- ఇరిగేషన్ ఆఫీస్‌ను క్యాంప్ ఆఫీస్‌గా మార్చడానికి మరో రూ.75 కోట్లు
- లంచానికి తీసుకున్న లింగమనేని రమేష్ ఇల్లు మార్చడానికి రూ.150 కోట్లు, ఆ ఇంటి చుట్టూ రోడ్లు, షెడ్లు కట్టడానికి రూ.200 కోట్లు 
- నదివైపు ఇంటి కిటికీలకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బిగించేందుకు రూ.7.5 కోట్లు 
- లింగమనేని రమేష్ వద్ద లంచానికి తీసుకున్న ఇంటిలో మొక్కలు నాటడానికి రూ.10 కోట్లు.  

Back to Top