లోకేష్‌ రాజకీయాలకు పనికిరాడు

తెలుగుదేశం పార్టీ మునిగిపోతున్న నావా

ఐటీ దాడులపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: రాజధాని పేరుతో చంద్రబాబు, లోకేష్‌ భారీ దోపిడీకి పాల్పడ్డారని, అమరావతిలో రాజధాని పేరుతో అతిపెద్ద స్కామ్‌కు తెరతీశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని.. స్వయంగా ప్రధానమంత్రి మోడీనే చెప్పారని గుర్తుచేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌పై ఐదు రోజుల పాటు ఐటీ దాడులు జరిగాయని, కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయని, వీటిపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ మునిగిపోతున్న నావా అని అంబటి విమర్శించారు. టీడీపీ అంతరించి పోయే స్థితికి చేరిందన్నారు. చంద్రబాబు తన పథకం ప్రకారం ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా పార్టీకి దూరం చేశారని తెలిపారు. టీడీపీకి తన కుమారుడు లోకేష్‌ను వారసుడిగా చేయాలనుకున్న చంద్రబాబు వ్యుహం ఫలించలేదని చెప్పారు. లోకేశ్‌ రాజకీయాలకు పనికిరాడని అన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top