తాడేపల్లి: తిరణాల్లో పిట్టల దొరలను మరిపించే రీతిలో చంద్రబాబు దత్తపుత్రుడు, తాబేదారు పవన్ కల్యాణ్ పిట్ట కథలు చెబుతున్నాడు. నిన్న రాయలసీమకు వెళ్లి సీమ పౌరుషం చూపిస్తామని, మొన్న ఇసుక కోసం రాజధాని ప్రాంతం అంతా నడుస్తానని మాట్లాడాడు. రాజధాని నుంచి రష్యా వరకు నడువు ఎవరు అభ్యంతరం తెలిపారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరిపడుతుందనే సామెతలా పవన్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. పవన్ పిచ్చి మాటలు విని జనాలు నవ్వుకుంటున్నారని, తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి అంటూ సూచన చేశారు. మరోపక్క గ్రాఫిక్స్‌తో ఐదేళ్లు రాష్ట్ర ప్రజలను వంచించిన చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి రాజధానిపై అపోహలు సృష్టించి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. అన్నీ చోట్ల డిపాజిట్లు కోల్పోయి ఒక్కచోట గెలిచాడు. గత కొన్ని రోజులుగా ఇష్టం వచ్చినట్లుగా మతం, కులం గురించి, మార్కెట్ యార్డులోకి వెళ్లి ఏదేదో మాట్లాడుతున్నాడు. పవన్ కల్యాణ్ సార్థక నామదేయుడు. ఎవరు పెట్టారో కానీ రెండో పార్టు కల్యాణంకు చాలా న్యాయం చేశాడు.. మొదటి పార్టు పవనం అంటే గాలి.. గాలిమాటలు చెబుతున్నాడు. వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా పవన్ గుర్తించడంట. ఈ రాష్ట్రానికి 50 శాతం పైచిలుకు ఓట్లు సాధించి 151 సీట్లు గెలుచుకున్న వైయస్ జగన్‌ను కేవలం ఒక్క సీటు గెలుచుకుని రెండు చోట్ల ఓడిపోయిన జనసేనాని గుర్తించకపోతే రాష్ట్రం ఖంగారవుతుందా..? సీఎం వైయస్ జగన్ 150 సీట్లు గెలవడానికి, ముఖ్యమంత్రి కావడానికి పవనే కారణమంట.. పవన్, చంద్రబాబు, బీజేపీ కలిసి పోటీ చేస్తే వైయస్‌ఆర్ సీపీకి దిక్కే ఉండిది కాదంట. కలిసి పోటీ చేసి ఉండాల్సింది.. ఆ మూడు పార్టీలను ప్రజలు కట్టకట్టి మహాసముద్రంలో పడేసేవారు. చిన్నప్పుడు తిరణాల్లో పిట్టలదొరలను చూసేవాళ్లం.. పిట్టలదొరలను మర్చిపోయే రీతిలో చంద్రబాబుకు తాబేదారుగా ఉన్న పవన్ పిట్ట కథలు చెబుతున్నాడు. రైతులకు న్యాయం జరగకపోతే ఊరుకోను అంటున్నాడు. రాయలసీమకు వెళ్లి సీమ పౌరుషం చూపిస్తానన్నాడు. మొన్న ఇసుక వ్యవహారం తేలకపోతే రాజధాని మొత్తం నడుస్తానన్నాడు. లాంగ్ మార్చ్‌లో రెండు కిలోమీటర్లు నడవలేని పవన్.. రాయలసీమ, రాజధానిలో నడుస్తావా.. అవసరమైతే రష్యా వరకు నడువు. నువ్వు నడిస్తే ఏమవుద్ది. పవన్ మాట్లాడే విధానం సరైంది కాదని గుర్తించాలి. Read Also: రాష్ట్రంలో మరిన్ని కంపెనీలు ఏర్పాటు కావాలి: సీఎం జగన్ పవన్ కల్యాణ్ మతం గురించి మాట్లాడుతున్నాడు. క్రిస్టియన్ స్కూల్‌లో చదివాను.. నా భార్య, పిల్లలు క్రిస్టియన్లు అని అంటాడు.. మరోపక్క ప్రభుత్వం మతమార్పిడి చేయిస్తుందంటాడు. హిందూమతం చాలా గొప్పదని అంటున్నాడు. అన్ని మతాలు, అన్ని కులాలు సహజీవనం చేస్తున్న దేశంలో మతాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ అసలు హిందువా..? లేక క్రిస్టియనా..? చెప్పాలి. పవన్ పిచ్చి వాగుడు చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎవరైనా తెలిసిన వారు ఉంటే చెప్పండి. రాజధాని ప్రకటించే సమయంలో రౌండ్ టేబుల్ సమావేశం కానీ, కనీసం ప్రధాన ప్రతిపక్షంతో సంప్రదింపులు, చర్చలు చేయని నారా చంద్రబాబు ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాడు. సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చి ఏదో అన్యాయం, గందరగోళం జరిగిపోతుందనే వాదన తీసుకువచ్చి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడు. రాజధానిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మాట్లాడాడు. రాజధానిపై కచ్చితమైన వాస్తవాలు చెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గ్రాఫిక్స్ చూపించి ఐదేళ్లు ప్రజలను మోసం చేశాడు. ఆ గ్రాఫిక్స్ చూసి నమ్మిన అమెరికాలోని తెలుగువారు అమరావతికి వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. కేవలం తాత్కాలిక బిల్డింగులు నాలుగు కట్టి అద్బుతమని భ్రమలు కల్పించాడు. అమరావతి సంపద సృష్టి అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఎవరికి సంపద సృష్టి నాయనా..? నీకు, నీ వర్గానికి సంపద సృష్టికి వీలుగా ఏర్పాటు చేసిన రాజధాని అని అందరికీ తెలిసిన సత్యం. దానిలో ఎన్ని స్కాములు, ఎన్ని గందరగోళాలు జరిగాయని ప్రభుత్వం బయటపెట్టే కార్యక్రమం చేస్తుంటే నీ తాబేదారులు, బినామీలకు ఏదో నష్టం జరుగుతుందనే భయంతో, బాధతో బాబు గగ్గోలు పెడుతున్నాడు. ఆరోగ్యశ్రీని ముఖ్యమంత్రి వైయస్ జగన్ పక్క రాష్ట్రాలకు ఇచ్చారు.. ఆదాయం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతుందని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్నాయి. పక్క రాష్ట్రంలో మెరుగైన సేవలు అందుతాయని భావించి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వర్తింపజేస్తుంటే ఆదాయం పోతుందని ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడు. రాజధాని అభివృద్ధికి చంద్రబాబు ఖర్చు చేసింది రూ.5500 కోట్లు మాత్రమే. ఏదో అద్బుతాలు చేశామనే మాట మాట్లాడుతున్నాడు ఇది చాలా దురదృష్టకరం. బాబు పరిపాలన మీద నమ్మకం కోల్పోయి.. చివరకు రాజధాని ఏర్పాటు చేసిన ప్రాంత ప్రజలు కూడా ఓటు వేయకుండా చిత్తచిత్తుగా ఓడించినా కూడా ఇంకా బాబుకు జ్ఞానోదయం రాకపోవడం బాధాకరం. రౌండ్‌టేబుల్, మరొకటి పెట్టి గందరగోళం చేసినా నువ్వు చేసిన పాపాలు పోవు అనే సత్యాన్ని గమనించాలి చంద్రబాబూ అని ఎమ్మెల్యే అంబటి సూచించారు. Read Also: రాష్ట్రంలో మరిన్ని కంపెనీలు ఏర్పాటు కావాలి: సీఎం జగన్