రాష్ట్రంలో మ‌రిన్ని కంపెనీలు ఏర్పాటు కావాలి:  సీఎం జ‌గ‌న్‌

అనంత‌పురంలో కియా మోటార్స్ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మ‌నీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కియా మోటార్స్ ఏర్పాటు కావ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని, ఇలాంటి మ‌రిన్ని కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటు కావాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆకాంక్షించారు. గురువారం అనంత‌పురం జిల్లాలోని పెనుగొండ‌లో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మ‌నీలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ 70 వేల కార్ల త‌యారీ కెపాసిటీ ఉన్న కియా మోటార్స్ భ‌విష్య‌త్తులో 3 ల‌క్ష‌ల కెపాసిటీకి చేరుకోవాల‌ని ఆకాంక్షించారు. ఈ కంపెనీ ద్వారా 18 వేల ఉద్యోగాలు క‌ల్పిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. కియా మోటార్స్ అభివృద్ధికి ప్ర‌భుత్వ స‌హాయ స‌హ‌కారాలు ఎల్ల‌ప్పుడూ ఉంటాయ‌ని భ‌రోసా ఇచ్చారు. త‌మ ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అభివృద్ధికి అండగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Read Also: పవన్‌ రాజకీయ అజ్ఞాని, బాబు బినామీ

Back to Top