సామాజిక బాధ్యత విపక్షాలకు లేదా?

అంబటి రాంబాబు

ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని దశలవారీగా నిషేధించడాన్ని అమలు చేసేందుకు షాపులు తగ్గించారు. ఈ ప్రభుత్వం వచ్చే సమయానికి 4350 మద్యం షాపులుంటే కొత్త పాలసీ ప్రకారం 3500 ఇచ్చారు. ప్రతిపక్ష నేతలు నాటు సారా అన్నారు, బెల్లం లెక్కలు చెప్పారు. మద్యం అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని దుష్ట శక్తులు ఇలాంటి దొడ్డిదారి పనులు చేస్తుంటాయి. అవి సాధారణమే. ప్రతిపక్షాల దగ్గర వీటికి సంబంధించిన ఆధారాలు ఉండబట్టే ఇక్కడ వాటి విషయం ప్రస్తావిస్తున్నారు. వీరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే గవర్నమెంట్‌కు చెప్పాలి కదా. ఫలానా వాళ్లు ఇలా అక్రమ మద్యం అమ్ముతున్నారని ప్రభుత్వానికి తెలియజేయాల్సిన సామాజిక బాధ్యతని ప్రతిపక్షం వదిలేస్తే ఎలా? మీరు అధికారులకు చెప్పండి. మామీద దుమ్మెత్తి పోయకుండా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దానిపై మేం చర్యలు తీసుకోకపోతే తప్పు. వీటిపై మీకు ఇన్ఫర్మేషన్ ఉండి కూడా చెప్పటం లేదంటే రాష్ట్రానికి మీరు ద్రోహం చేసిన వారు అవుతారు.
అచ్చెంనాయుడు గారిని పశువులాసుప్రతిలో చేర్చాలని సభలో సభ్యులు అన్నమాటను రికార్డులనుంచి తొలగించాలని కోరుతున్నాను.  ఆ స్థానంలో వారిని మనుషుల హాస్పటల్లో చేర్పించే విధంగా సవరించాలని కోరుతున్నా.

 

తాజా వీడియోలు

Back to Top