నలుగురు విద్యార్ధులు గల్లంతవడంపై  వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి, విచారం

తాడేప‌ల్లి: నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్‌లో కనుమ పండుగ రోజు సరదాగా గడిపేందుకు వెళ్ళిన నలుగురు విద్యార్ధులు గల్లంతవడం విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గల్లంతైన విద్యార్ధులలో ఇద్దరి మృతదేహాలు లభ్యమవగా మరో ఇద్దరు విద్యార్ధుల ఆచూకీ ఇంకా తెలియలేదు.

Back to Top