సాల్మన్ హత్యపై రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ నిరసనలు

జిల్లా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాల వద్ద ధర్నాలు

తాడేప‌ల్లి:  పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మండా సాల్మన్ హత్యను నిరసిస్తూ రాష్ట్ర‌వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు చేపట్టిన ధర్నా కార్యక్రమాలు చేప‌ట్టారు.  రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షడు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లెనూ (శనివారం) జనవరి 17వ తేదీ) నిరసనకు దిగాయి. 

ఏలూరు జిల్లా:
పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త మండా సాల్మన్ హత్యను నిరసిస్తూ ఏలూరులో పాత బస్టాండ్ వద్ద డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు శాంతియుత నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుకపెయ్యి సుధీర్‌బాబు, జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ), నగర అధ్యక్షుడు గుడిదేసి శ్రీనివాస్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నేరుసు చిరంజీవి, నగర మహిళా అధ్యక్షురాలు విజయనిర్మల, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు డింపుల్ జాబ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా:
శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనకు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్‌తో పాటు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, అందవరపు సూరిబాబు, గేదెల పురుషోత్తం పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా:
కర్నూలు పాత బస్టాండ్ సమీపంలోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో ఎర్రగుంట్లపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మతో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా:
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ సీఈసీ సభ్యుడు మల్లాది విష్ణువర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ బూదాల శ్రీనివాసరావు, శరం శెట్టి పూర్ణచంద్రరావు, కాలే పుల్లారావు, దాస్ ప్రకాష్ కెనడి, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

విజయనగరం జిల్లా:
విజయనగరం జిల్లా కేంద్రంలోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసనలో జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పీరుబండ జైహింద్ కుమార్‌తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పల్నాడు జిల్లా (నరసరావుపేట):
నరసరావుపేట అంబేడ్కర్ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో మాజీ మంత్రి విడుదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, టీజేఆర్ సుధాకర్ బాబు, నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గజ్జల సుధీర్, భార్గవ్ రెడ్డి (సత్తెనపల్లి సమన్వయకర్త), పూనూరు గౌతమ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా:
గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పరిసపోగు శ్రీనివాసరావు మాదిగ పాల్గొన్నారు.

తిరుపతి / ఉమ్మడి చిత్తూరు జిల్లా:
తిరుపతి నగరంలోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర తలారి ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సాల్మన్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కృష్ణా జిల్లా:
గుడివాడలో అంబేడ్కర్ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వైయ‌స్‌ఆర్ (కడప) జిల్లా:
కడప అంబేడ్కర్ సర్కిల్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో కడప మేయర్ పాకా సురేష్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాబు పాల్గొన్నారు.
 

Back to Top