చంద్రబాబుకు ఇక రాజకీయ సన్యాసమే

సభ నుంచే కాదు.. రాజకీయంగానే చంద్రబాబు నిష్క్రమించాడని అర్థమవుతుంది

అసెంబ్లీలో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

అసెంబ్లీ: చంద్రబాబుకు రాజకీయంగా ఈరోజుతో నూకలు చెల్లాయని, సొంత నియోజకవర్గంలోనే తిరిగిపోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి.. రాజకీయ నిష్క్రమణ తప్ప మరొకటి లేదని చంద్రబాబుకు అర్థమైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాజకీయ భవిష్యత్తు లేదని గ్రహించి సభలో సింపథి అవతారం ఎత్తి నటనా చాతుర్యం ప్రదర్శించాడని, చంద్రబాబు నటనను ప్రజలు నమ్మరన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. 

‘‘నేను సభకు రాను.. వస్తే ముఖ్యమంత్రిగానే వస్తాననే మాట చంద్రబాబు మాట్లాడి వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తరువాత కుప్పంలో జరిగిన ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత బహుశా చంద్రబాబు రాజకీయ సన్యాసం చేయాల్సిన అనివార్య పరిస్థితిని ప్రజలు కల్పించారని భావిస్తున్నాం. నిన్న సభకు రాకుండా బయట ఉండి మొహం చాటేశారు. ఇవాళ సభకు వచ్చి వ్యవసాయ మంత్రి మాట్లాడుతున్న సమయంలో అనేక సందర్భాల్లో మధ్యలో కలగజేసుకొని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. బాబాయి.. గొడ్డలి, తల్లి, చెల్లి ఇవన్నీ చర్చిద్దామనే మాటలు మాట్లాడింది చంద్రబాబే. సభ నుంచి నిష్క్రమించాడని అనుకుంటున్నాడేమో.. రాజకీయంగానే చంద్రబాబు నిష్క్రమించాడని స్పష్టంగా అర్థం అవుతుంది. 

సీఎం వైయస్‌ జగన్, ఆయన కుటుంబాన్ని విమర్శించే ప్రయత్నం చేశారు. స్పీకర్‌ను ఉద్దేశించి కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వంగవీటి మోహనరంగ, మాధవరెడ్డి హత్య, వెన్నుపోటు పొడిచిన ఎన్టీఆర్‌ గురించి మాట్లాడాలి. మాధవరెడ్డి అనగానే.. చంద్రబాబు చాలా ఆవేశంతో ఊగిపోయారు. మాధవరెడ్డి హత్యలో చంద్రబాబు హస్తం ఉందనే ఆరోపణ గురించి మాట్లాడుదాం అంటే బాబు ఆవేశపడిపోయాడు. 

చంద్రబాబు జీవిత చరిత్ర అంతా పరిశీలిస్తే సొంతంగా ముఖ్యమంత్రి అయిన సందర్భాలు ఎప్పుడూ లేవు. చంద్రబాబు స్వయం ప్రకాశితుడు కాదు. సీఎం వైయస్‌ జగన్‌ వచ్చిన తరువాత రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ బీసీలంతా సీఎం వైయస్‌ జగన్‌ పక్షాన నిలబడ్డారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇలా అన్ని సామాజిక వర్గాలు సంక్షేమ పాలన అందిస్తున్న సీఎంను భుజాన మోస్తున్నారు. కుప్పంలో కూడా అన్ని మండలాలు, మున్సిపాలిటీ సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఉన్న వైయస్‌ఆర్‌ సీపీ గెలిచిన తరువాత.. సొంత నియోజకవర్గంలోనే తిరిగిపోటీ చేసి గెలిచే పరిస్థితి లేదని రాజకీయ నిష్క్రమణ తప్ప మరొకటి లేదని చంద్రబాబుకు అర్థమైంది. 

 

తాజా ఫోటోలు

Back to Top