దమ్ముంటే నిరూపించు చంద్రబాబూ

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
 

సత్తెనపల్లి: సచివాలయ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరిగాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. పరిపాలన పగ్గాలు చేపట్టి నాలుగు నెలల్లోనే లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. పాలన ప్రతి గడప ముందుకు తీసుకువచ్చేందుకు సీఎం వైయస్‌ జగన్‌ గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకువచ్చారన్నారు. ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. సచివాలయ ఉద్యోగాల నియామకంలో అక్రమాలు జరిగాయని చంద్రబాబు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ముంటే అక్రమాలు ఎక్కడ జరిగాయో నిరూపించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పరిపాలన చేస్తున్నారన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top